Ambulance : చోరీ చేసిన అంబులెన్స్‌తో జాతీయ రహదారిపై దొంగ హల్‌చల్
ప్రధానాంశాలు:
Ambulance : చోరీ చేసిన అంబులెన్స్‌తో జాతీయ రహదారిపై దొంగ హల్‌చల్
Ambulance : అంబులెన్స్‌ను చోరీ చేసిన ఓ దొంగ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై హల్ చల్ చేశాడు. చోరీపై సమాచారం అందుకున్న పోలీసులు దొంగను పట్టుకునేందుకు చర్యలు చేపట్టగా అంబులెన్స్‌తో భయభ్రాంతులకు గురి చేశాడు. నల్లగొండ జిల్లా టేకుమట్ల వద్ద పోలీసులు అంబులెన్స్‌ను అడ్డగించి దొంగను పట్టుకున్నారు.
హయత్‌నగర్‌లో దొంగ 108 అంబులెన్స్‌ను చోరీ చేసి విజయవాడ వైపు తీసుకెళ్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కాగా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి నకిరేకల్ పోలీస్ స్టేషన్ వరకు దొంగ చిక్కకుండా జాతీయ రహదారిపై వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తూ పారిపోతున్నాడు. చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపడానికి ప్రయత్నించిన ఎస్ఐ జాన్ రెడ్డిని దొంగ వాహనంతో ఢీ కొట్టి మరీ పారిపోయాడు. కొర్లపహాడ్ టోల్‌గేట్ ను సైతం ఢీ కొట్టి పారిపోయాడు.
కాగా టేకుమట్ల స్టేజి వద్ద ఎస్ఐ శివతేజ రోడ్డుకు అడ్డంగా లారీలను పెట్టి అంబులెన్స్ ను అడ్డగించాడు. దొంగను అదుపులోకి తీసుకున్నాడు. దొంగ గతంలోనూ ఇదేవిధంగా అంబులెన్స్ ను చోరీ చేసినట్లు ఎస్ఐ శివతేజ తెలిపారు. Thief rampages on national highway with stolen ambulance ,