Sarasvati Pushkaram : సరస్వతి పుష్కరాలకు హాజరై టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్..!
ప్రధానాంశాలు:
సరస్వతి పుష్కరాలకు హాజరై టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్..!
Sarasvati Pushkaram : బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించగా అంగరంగ వైభవంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం పుణ్యక్షేత్రంలోని త్రివేణిసంగమంలో సరస్వతి పుష్కరాలు సోమవారం 12వ రోజుకు చేరుకున్నాయి.ఈ రోజు టీపీసీసీ ఉపాధ్యక్షులు,మేడ్చల్ నియోజకవర్గ Congress కాంగ్రెస్ ఇంచార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ Thotakura Vajresh Yadav గారు,నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి సరస్వతిఘాట్ లో పుష్కర స్నానమాచరించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని,ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని,దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ గారిని కలవడం జరిగింది.

Sarasvati Pushkaram : సరస్వతి పుష్కరాలకు హాజరై టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్..!
కాగా,తమ హయాంలో తొలిసారి వచ్చిన పుష్కరాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి గారు,రాష్ట్ర మంత్రులు కోండా సురేఖ గారు,దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు,అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసినారు అని అన్నారు. ఎక్కడా భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించినారు. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయంటూ తెలంగాణ కాంగ్రెస్ సర్కారును భక్తులు కొనియాడారు.
తోటకూర వజ్రేష్ యాదవ్ గారితో పాటు మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ గారు,మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి గారు, మేడ్చల్ నియోజకవర్గ బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గారు,మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి గారు,గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిపేట్ శ్రీనివాస్ గారు,శామీర్ పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాష్కీ శంకర్ గౌడ్ గారు,దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పా రామ రావు గారు,ఘాట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిడ్ల ముత్యాలు యాదవ్ గారు,పలువురు మాజీ ప్రజాప్రతినిధులు,తదితర నాయకులు ఉన్నారు.