TS Free Bus : ఆంధ్ర మహిళలు తెలంగాణలో ఫ్రీ బస్సు ఎక్కే ముందు ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TS Free Bus : ఆంధ్ర మహిళలు తెలంగాణలో ఫ్రీ బస్సు ఎక్కే ముందు ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :17 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  TS Free Bus : ఆంధ్ర మహిళలు తెలంగాణలో ఫ్రీ బస్సు ఎక్కే ముందు ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు...!

TS Free Bus : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం. అయితే తెలంగాణలో ఉంటున్నటువంటి ఆంధ్ర మహిళలకి ఈ సదుపాయం వర్తిస్తుందా.. ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో చాలామంది ఆంధ్ర నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి పనిచేస్తున్న మహిళలు ఎంతోమంది ఉంటారు. అక్కడ వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర మహిళలు లాగానే బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఉచిత బస్సు సౌకర్యం కేవలం తెలంగాణ రాష్ట్ర మహిళల ఆంధ్ర రాష్ట్ర మహిళలకు వవర్తిస్తుందా.. వర్తించద.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గురించి పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణస్వీకారం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు ఒక ఆరు గ్యారెంటీలని మేము అధికారంలోకి వస్తే తప్పకుండా అమలు చేస్తామని వారు ప్రకటించడం జరిగింది. అయితే చాలామంది ఈ ఆరు గ్యారెంటీలని అమలు చేయటం ఎంతో కష్టం దీనికి కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరమవుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినంత ఈజీ కాదు దీనికి అనేక సవాళ్లు ఉంటాయని చెప్పినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలని ఎప్పుడెప్పుడు అమలు నుంచి ఈ పథకం చేసే పనిలో పడింది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణాన్ని ప్రకటించటమే కాదు.. ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది.

డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ పథకం లోకి వచ్చింది. ఆర్టీసీ అధికారులైతే ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల కొన్ని కోట్ల రూపాయలు నష్టం వస్తుందని చెబుతున్నప్పటికీ హైదరాబాద్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ లాంటి సమస్యలు తగ్గుతాయని అలాగే దీని ద్వారా ఆక్సిడెంట్ల సంఖ్య కూడా తగ్గుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ పథకానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతానికి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా సరే ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. అయితే మొదట వారం రోజులపాటు బస్సు ఎక్కుతున్నటువంటి ఆడపడుచుల దగ్గర ఏ ఐడెంటిటీ కార్డు తీసుకోకండి. ఎక్కిన ప్రతి ఒక్కరిని తమ గమ్యస్థానానికి చేర్చండి అని అధికారులు తెలియచేసినట్టు కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు వెల్లడించారు.

అయితే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలంటే మాత్రం తాము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులమీ అనేటువంటి నిరూపణ చేసే ఏదైనా ఒక గుర్తింపు కార్డు కచ్చితంగా తమతో పాటు క్యారీ చేయాల్సిందే.. ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ లైసెన్స్ కానీ ఏదైనా కూడా తమతోపాటు తీసుకువెళ్తేనే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆడవారికి అందుబాటులో ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని దాటి వేరే రాష్ట్రంలో ప్రయాణం చేసిన వేరే రాష్ట్రానికి సంబంధించిన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలన్న ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తించదు. ఉదాహరణకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలి అనుకునేటువంటి తెలంగాణ మహిళలు ఎవరైనా ఉంటే వారికి తెలంగాణ బోర్డర్ వరకు అంటే విజయవాడ వచ్చేటప్పుడు సూర్యపేట, కోదాడ వరకు కూడా తెలంగాణ ప్రాంతమే ఉంటుంది. సో అక్కడి వరకు కూడా తెలంగాణ కిందకే వస్తుంది. కాబట్టి వారికి అక్కడి వరకు ఉచిత ప్రయాణం ఉంటుంది. ఆ తర్వాత నుంచి విజయవాడ వరకు ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం అయితే చేస్తారో అంతవరకు పే చేస్తే సరిపోతుంది. అయితే ఆంధ్ర మహిళలకి కూడా ఈ సదుపాయాన్ని కల్పించాలని అనేక మంది కోరుతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కనీసం హైదరాబాద్ లాంటి ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం గనుక కేవలం తెలంగాణ రాష్ట్ర స్థానికత ఉన్న మహిళలకు మాత్రమే కాకుండా హైదరాబాద్ లాంటి చోట్ల ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కలిపిస్తే చాలామందికి ఇది మేలు చేకూరుస్తుంది…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది