Omicron : తెలంగాణలోకి ఎంటరైన ఒమిక్రాన్.. రెండు కేసులు నమోదు..
Omicron : కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామంటూ ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచంపై ఒమిక్రాన్ రూపంలో మరో పిడుగు పడింది. కరోనాలో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసింది. ఇది డెల్టా వేరియంట్ కంటే చాలా ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు.. అయితే ప్రపంచంలో చాలా దేశాల్లోకి ఎంటరైన ఈ వేరియంట్ ఇండియాలో సైతం అడుగు పెట్టింది.
symptoms of corona second waveఇటీవల ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదు కాగా, తాజాగా తెలంగాణలోనూ రెండు కేసులు వెలుగుచూశాయి. ఆఫ్రికా దేశం నుంచి వచ్చి బెంగాళ్ కు వెళ్లిపోయిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అయితే ఒమిక్రాన్ సోకిన ఇద్దరు విదేశీయులేనని డీహెచ్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. ఇందులో 24 ఏళ్ల మహిళ, 23 ఏళ్ల యువకుడు ఉన్నట్టు తెలిపారు.
వీరిద్దరూ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు సమాచారం. అయితే తెలంగాణకు చెందిన వారికి ఎవరికీ వైరస్ సోకలేదని ఆందోళన చెందాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు.