Vakkati Srihari : మంత్రి వాకిటి శ్రీహరి కీలక హామీ.. ఇందిరమ్మ ఇళ్ల దారులకు ఇక బేఫికర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vakkati Srihari : మంత్రి వాకిటి శ్రీహరి కీలక హామీ.. ఇందిరమ్మ ఇళ్ల దారులకు ఇక బేఫికర్

 Authored By ramu | The Telugu News | Updated on :28 June 2025,1:37 pm

ప్రధానాంశాలు:

  •  ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు రాకుంటే సొంత ఇల్లు అమ్మి డబ్బులు ఇస్తా అంటున్న మంత్రి వాకిటి శ్రీహరి

  •  ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం సొంత ఇల్లును అమ్మకానికి పెడతా అంటున్న కాంగ్రెస్ మంత్రి

Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా మక్తల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని, అవసరమైతే తన ఇల్లు అమ్మి అయినా బిల్లులు చెల్లిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో 291 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను పంపిణీ చేశారు.

Vakkati Srihari మంత్రి వాకిటి శ్రీహరి కీలక హామీ ఇందిరమ్మ ఇళ్ల దారులకు ఇక బేఫికర్

Vakkati Srihari : మంత్రి వాకిటి శ్రీహరి కీలక హామీ.. ఇందిరమ్మ ఇళ్ల దారులకు ఇక బేఫికర్

Vakkati Srihari : ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం సొంత ఇల్లును అమ్మకానికి పెడతా అంటున్న కాంగ్రెస్ మంత్రి

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 నెలల్లోనే పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రోగ్రాంలో భాగంగా మక్తల్ మున్సిపాలిటీకి 291 ఇళ్లు మంజూరు చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేదలకు గృహసౌకర్యం కల్పించడమే కాకుండా, వారి జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.500 కోట్లు ఖర్చు చేసి ప్రాంత రూపురేఖలు మార్చే విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి శ్రీహరి వెల్లడించారు. తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, మాట ఇచ్చిన ప్రతి విషయంలో అమలు చేసే నిబద్ధతను చూపిస్తామని చెప్పారు. పేదల పక్షంలో నిలబడే ప్రభుత్వం ఇది అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలని ఆయన హామీ ఇచ్చారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది