Indiramma Houses : ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన
ప్రధానాంశాలు:
Indiramma Houses : ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు మంజూరు అయినా వారికి ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగయ్య యాదవ్ గారు, అధ్యక్షులు ముత్యాలు యాదవ్ గారు, ఈ సందర్భంగా మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ గారు, మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో 6వ వార్డులో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నామని, పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని అర్హులందరికీ ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని రానున్న రోజుల్లో రెండవ విడత కింద మల్లి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Indiramma Houses : ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏనుముల రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్ష రూపాయలు మంజూరు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మహోత్సవం కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గంలోని ఘట్కేసర్ మున్సిపాలిటీ లో పలు వార్డులో పలువురు నాయకుల సహకారం తో భూమి పూజ చేసుకున్నాం అని తెలిపారు…. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమం లో డీసీవీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు గారు, మొయినార్టీ అధ్యక్షులు ఫరూక్ గారు, నాయకులు సిరాజ్ గారు, సత్తి రెడ్డి గారు, రెహమాన్ గారు, నర్సింగ్ రావు గారు,గోదా గణేష్ యాదవ్ గారు, సాయి యాదవ్ గారు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు