Revanth Reddy : ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో సందడి వాతావరవణం నెలకొంది. పోలింగ్ డే కావడంతో ఉదయం 7గంల నుండే ఓటర్లు పోలింగ్ బూత్‌కి చేరుకొని ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువత, కొత్తగా ఓటు హక్కువచ్చిన వారు ఎక్కువ ఓట్లు వేసినట్టు తెలుస్తుంది. అయితే సాధారణంగా ఎక్కువ ఓట్లు పోల్ అయితే ఆ పోలింగ్ బూత్‌ల గురించి వార్తలలో చెబుతుంటారు కాని ఇప్పుడు తెలంగాణలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ జరగకుండా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అదీ ఇదీ కాదు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని ఓ గిరిజన గ్రామం కావడం విశేషం.
పోలింగ్ సిబ్బందికి పనిలేకుండా గ్రామ ప్రజలు నిరసన తెలియజేస్తూ హాట్ టాపిక్‌గా మారారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెంలో మూడు రోజులుగా కరెంటు లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం, మంచినీటి వసతి, రేషన్ కార్డులు లాంటి సమస్యలు కూడా ఉన్నాయని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు. నల్లమల ప్రాంతం కావడంతో పాములు వస్తున్నాయని, కరెంట్ లేకపోవడంతో పాము కాటుకు గురి కావాల్సివస్తోందని తెలిపారు. విద్యుత్ అధికారులు కరెంటు బిల్లులు అడుగుతారు కాని, కరెంటు మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నికల సీజన్ కావడంతో వారంతా ఒక్కతాటిపైకి వచ్చి ఓటు వేయకుండా గ్రామంలోనే బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించడంతో పోలింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో విద్యుత్ సిబ్బంది హుటాహుటిన చెంచు గూడెంకు చేరుకున్నారు. సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్థులు మాత్రం బెట్టువీడలేదు. ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇస్తే కానీ ఓటు వేయడానికి రాలేమని తేల్చి చెబుతున్నారు. మొత్తానికి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెం చెంచులు ఓట్లు వేయకుండా బహిష్కరించి ఆందోళన చేపట్టడం చర్చనీయాంశం అయింది.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.