Warangal Politics : వరంగల్ లో వేడెక్కుతున్న రాజకీయాలు… గురు శిష్యుల మధ్య గట్టి పోటీ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Warangal Politics : వరంగల్ లో వేడెక్కుతున్న రాజకీయాలు… గురు శిష్యుల మధ్య గట్టి పోటీ…!

 Authored By ramu | The Telugu News | Updated on :13 April 2024,1:00 pm

Warangal Politics : తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకుల విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు పూర్తిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికలకు ముందే చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం తీవ్రస్థాయిలో వేడెక్కిందని చెప్పాలి. ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండి ప్రాణ స్నేహితులుగా కలిసి తిరిగిన నేతలు ఇప్పుడు శత్రువులుగా మరి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Warangal Politics : వరంగల్లో వేడెక్కుతున్న రాజకీయాలు

అయితే రాబోయే లోక్ సభ ఎన్నికలకు వరంగల్ నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పోటీ చేయనున్నారు. అయితే మొన్నటి వరకు గురు శిష్యులుగా ఉన్న ఆరూరి రమేష్ మరియు కడియం శ్రీహరి ఇప్పుడు వేరువేరు పార్టీలలో ఉండడంతో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోవడం సంచలనంగా మారింది.ఈ క్రమంలోనే ఆరూరి రమేష్ ఒకప్పుడు తన దగ్గర సాధారణ కార్యకర్తగా ఉన్నాడని , వాడిని నేను క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా తయారు చేశానని కడియం శ్రీహరి పలు సందర్భాలలో చెప్పుకొస్తున్నారు. దీనికిగాను నాకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చావా అంటూ కడియం శ్రీహరి ఆరూరి రమేష్ ను నిలదీశారు. ఒకవేళ నువ్వు డబ్బులు నాకు ఇచ్చినట్లయితే నిరూపించాల్సిందిగా కడియం శ్రీహరి సవాల్ విసిరారు. నా ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎదిగిన ఆరూరి రమేష్ ఇప్పుడు నాకే వెన్నుపోటు పొడిచి నాపై విమర్శలు గుప్పిస్తున్నాడంటూ కడియం శ్రీహరి మండిపడ్డారు.

ఈ నేపథ్యంలోనే తన కూతురు కడియం కావ్య గురించి కూడా శ్రీహరి ఆసక్తికరమైన విషయాలనుతెలియజేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ…నా కూతురు వరంగల్ లో పుట్టి పెరిగిన బిడ్డ. ఇదే ప్రాంతంలో కొన్నేళ్లపాటు ఉద్యోగం కూడా చేసింది. తన తోటి విద్యార్థిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. అంతేకాదు నా కూతురు చదువులో ఎస్సీ రిజర్వేషన్స్ సర్టిఫికెట్ కూడా ఉపయోగించుకుంది. పెళ్లి చేసుకుని మతం మారినంత మాత్రాన తన కులం మారదని ఇక ఈ విషయాన్ని 2017లో సుప్రీంకోర్టు కూడా తెలియజేసిందని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. నా కూతురు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకుంది.

Warangal Politics వరంగల్ లో వేడెక్కుతున్న రాజకీయాలు గురు శిష్యుల మధ్య గట్టి పోటీ

Warangal Politics : వరంగల్ లో వేడెక్కుతున్న రాజకీయాలు… గురు శిష్యుల మధ్య గట్టి పోటీ…!

నా కూతురు చేసే మంచి పనులే తనను గెలిపిస్తాయంటూ ఈ సందర్భంగా కడియం శ్రీహరి పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీ మారిన తర్వాత మందకృష్ణ మాదిగ కేవలం తనపై తన కూతురిపై విమర్శలు చేయడం ఏమాత్రం తగదని కడియం ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ వద్ద మేము డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు ఉంటే నిరూపించాల్సిందిగా అలా నిరూపిస్తే తన కూతురు పోటీ నుంచి తప్పుకుంటుందంటూ కడియం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వరంగల్ రాజకీయాలలో హోరా హోరీగా నడుస్తున్న పోటీలో ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది