CM Revanth Reddy : రేవంత్ రెడ్డికి ఆ ఇద్దరి అక్కలతో పంచాయతీ ఏంది..అసలు కథ ఇదా?
CM Revanth Reddy : ఇప్పుడు అసెంబ్లీలోనే కాకుండా బయట కూడా రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు కస్సుబుస్సు మంటున్నారు. బీఆర్‌ఎస్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేయడంతో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు లేని విధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు మహిళా నేతలను టార్గెట్ చేయడం చర్చకి దారి తీసింది. ఢిల్లీ వస్తామని రాలేదనే కోపమే సీఎం వ్యాఖ్యలకు కారణమన్నట్లు సీతక్క ఇచ్చిన వివరణతో రాజకీయ వర్గాల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి.
CM Revanth Reddy : ఇది అసలు కారణం..
గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి… సునీతా లక్ష్మారెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డికి మంచి సంబంధాలే ఉండేవని చెబుతున్నారు. అయితే తనను కాంగ్రెస్‌లోకి పిలిచి… ఆ ఇద్దరూ బీఆర్‌ఎస్‌లో చేరినట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కానీ, వివాదానికి అసలు కారణం అది కాదని సమాచారం. సబితకు రేవంత్ రెడ్డికి మధ్య రెండు మూడు విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయని… కానీ, ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటనలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహానికి కారణమని అంటున్నారు. 2018 ఎన్నికలకు ముందు సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానం మేరకే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చారనే విషయంతో అంతా ఏకీభవిస్తున్నా.. అలా పార్టీలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న ఓ సంఘటన వల్లే సబిత కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందంటున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి తాజా కోపానికి ఐదేళ్ల క్రితం నాటి ఈ ఘటన కారణం కాదని… అది ఓ సాకుగా మాత్రమే చెబుతున్నారని అంటున్నారు. ఒకప్పుడు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య అక్కా తమ్ముళ్ల బంధం ధృడంగానే ఉండేదట. సబిత కుమారుడు కార్తీక్‌రెడ్డి కూడా సీఎం రేవంత్‌కు మంచి స్నేహితుడని చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఇంతటి అనుబంధం వల్లే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సబితను తిరిగి కాంగ్రెస్‌లోకి రమ్మని సీఎం ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. సబితతోపాటే నర్సాపురం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు పావులు కదిపినట్లు చెబుతున్నారు. సీఎం ప్రతిపాదనకు తొలుత ఈ ఇద్దరూ ఒకే అన్నా… చివరి క్షణంలో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో రాహుల్ వద్ద తన ఇజ్జత్ పోయినట్లు సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు.