Ration Cards : గుడ్‌న్యూస్ తెలంగాణ కొత్త రేషన్ కార్డుల విధి విధానాలు ఇవే..!
ప్రధానాంశాలు:
Ration Cards : గుడ్‌న్యూస్ తెలంగాణ కొత్త రేషన్ కార్డుల విధి విధానాలు ఇవే..!
Ration Cards : హైదరాబాద్ : తెలంగాణలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ ఈ మేరకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డు అర్హతపై పరిశీలన చేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.2 లక్షలు ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు జారీ చేయాలని ప్రతిపాదించింది.
కొత్త రేషన్ కార్డుల పంపిణీని పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీలో పౌర సరఫరాలు & నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ సబ్ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.కొత్త ఆహార భద్రత (రేషన్) కార్డులు మరియు ఆరోగ్య కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలు, విధి విధానాలను సబ్ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్నది.