Telangana Cabinet : మిగితా ఆరు మంత్రి పదవులు వాళ్లకేనా.. తెలంగాణలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ?
Telangana Cabinet : తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి మూడు రోజులు అవుతోంది. తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే.. మరో 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా పోటీ చేశారు. అంటే.. సీఎం రేవంత్ తో సహా మొత్తం 12 మందికి మాత్రమే ఇప్పటి వరకు మంత్రి పదవులు వచ్చాయి. మరో ఆరుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. […]
ప్రధానాంశాలు:
మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కేది ఎవరికి?
ఆ ఆరుగురు మంత్రులు ఎవరు?
ఎవరి వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతోంది?
Telangana Cabinet : తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి మూడు రోజులు అవుతోంది. తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే.. మరో 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా పోటీ చేశారు. అంటే.. సీఎం రేవంత్ తో సహా మొత్తం 12 మందికి మాత్రమే ఇప్పటి వరకు మంత్రి పదవులు వచ్చాయి. మరో ఆరుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో కాబోయే మంత్రులు ఎవరు అనేదానిపై క్లారిటీ రావడం లేదు. అయితే తమకే మంత్రి పదవి కావాలని చాలామంది ఎమ్మెల్యేలు హైకమాండ్ ముందు కోరుతున్నారు. దీంతో ఎవరికి ఇవ్వాలి.. అనే దానిపై హైకమాండ్ కూడా చర్చిస్తోంది. ఇప్పటివరకు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ లాంటి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు దక్కాయి. హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన నాయకులకు మంత్రి పదవి దక్కలేదు.
అందుకే.. మంత్రివర్గ విస్తరణలో ఆయా జిల్లాలకు చెందిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కూడా మంత్రి పదవి దక్కలేదు. గడ్డం ప్రసాద్ కు స్పీకర్ పదవి మాత్రం దక్కింది. పలు సమీకరణాలు ఆధారంగా చేసుకుంటే తమకే మంత్రి పదవి దక్కుతుందని చాలా మంది నేతలు అనుకున్నారు. అందులో ఆదిలాబాద్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ వెంకటస్వామి, ఇబ్రహీంపట్నం నుంచి గెలిచిన మల్ రెడ్డి రంగారెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మధు యాష్కీ గౌడ్.. ఇలా మంత్రి పదవుల కోసం చాలా మంది హైకమాండ్ కు వినతులు పంపిస్తున్నారు.
Telangana Cabinet : ఆరుగురు మంత్రులుగా ఎవరిని ఎన్నుకుంటారో?
అయితే.. మంత్రివర్గ విస్తరణలో భాగంగా మరో ఆరుగురు మంత్రులకు చాన్స్ దక్కే అవకాశం ఉన్నా.. అందులో ఎవరికి చాన్స్ దక్కుతుంది అనేది పలు సామాజిక, ఇతర సమీకరణాల మీద ఆధారపడి ఉంటుంది. వాటన్నింటినీ లెక్కలోకి తీసుకొని మంత్రి పదవులను ఇవ్వాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నారట. అందుకే ఏమాత్రం తొందరపడకుండా కాస్త లేట్ అయినా సరైన నాయకులకే మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందట.