Telangana BJP : ఆ విషయంలో కాంగ్రెస్ ను మించిపోయిన బీజేపీ.. వీళ్ల అసలు రంగు బయటపడిందిగా
Telangana BJP : తెలంగాణ బీజేపీ పరిస్థితి గురించి ఇప్పుడు తలుచుకుంటేనే జనాలకు చిరాకేస్తోంది. మొన్నటి దాకా బీజేపీ పార్టీని చూసి అదిగో పార్టీ అంటే అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని అందరూ గొప్పలు చెప్పుకున్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం బీజేపీ పార్టీని చూస్తేనే చిరాకేస్తుంది జనాలకు. అసలు ఏంటి ఆ అంతర్గత విభేదాలు. ఏంటి ఆ గొడవలు, ఏంటి ఆ కలహాలు. వాళ్లలో వాళ్లే కొట్టుకునే స్థాయికి చేరుకున్నారు. చివరకు ప్రెస్ మీట్ పెట్టి మరీ.. సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లారంటే ఇక ఆ పార్టీ పరిస్థితి ఏంటో చెప్పుకోవచ్చు.
ఇదంతా పక్కన పెడితే ఇదే సమయంలో బీజేపీ హైకమాండ్ కూడా తెలంగాణలో బీజేపీ నాయకత్వంలో పలు మార్పులు చేసింది. బండి సంజయ్ ని తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని నియమించింది. మరి.. కేంద్ర మంత్రి పదవి కిషన్ రెడ్డికి ఉందా.. పోయిందా లేక రెండు పదవులు ఒకేసారి నిర్వర్తిస్తారా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే.. ఆయన ఢిల్లీలోనే ఉన్న కేంద్ర కేబినేట్ భేటీకి ఇటీవల హాజరు కాలేదు. దాన్ని బట్టి చూస్తే ఆయన కేంద్ర మంత్రి పదవి పోయినట్టే అని అనుకోవాలి.ఇక.. బండి సంజయ్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు. ఆయన్ను బీజేపీ చీఫ్ స్థానం నుంచి తొలగించారు సరే.. మరి ఆయనకు ఏ పదవి ఇస్తారు అనేదానిపై క్లారిటీ లేదు. కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి కానీ.. వాటిలో నిజం ఉందా లేదా అనేది తెలియదు. ఇక.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. బీజేపీలో చోటు చేసుకునే మార్పులను ముందే పసిగట్టి తనకు కూడా ఏదైనా పదవి ఇవ్వాలని మీడియా ముందే చెప్పేశారు. పదేళ్ల నుంచి పార్టీలో నమ్మకంగా పని చేశానని..
Telangana BJP : బండి సంజయ్ సంగతి ఏంటి మరి?
దుబ్బాకలోనూ గెలిచి చూపించానని అంటూ తనకు కూడా పదవి ఇవ్వాలని అధిష్ఠానాన్నే నేరుగా డిమాండ్ చేసినంత పని చేశారు. కానీ.. అధిష్ఠానం మాత్రం ఈటల రాజేందర్ కు కీలక పదవి అప్పగించింది. అలాగే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా పదవి ఇచ్చింది కానీ.. రఘునందన్ రావుకు, విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్ లకు మొండి చేయి చూపింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో కంటే కూడా ఇక్కడే ఎక్కువ వర్గాలుగా విడిపోయి నేతలు తమ అసంతృప్తులను వెల్లగక్కుతున్నారు.