YS Sharmila : షర్మిల జగనన్న బాణమో లేదా కేసీఆర్ బాణమో కాదు.. ఆమె ప్రతి కదలిక ‘బ్రదర్’ వ్యూహమే
YS Sharmila : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంపై రకరకాలుగా పుకార్లు మరియు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్ జైల్లో ఉన్న సమయంలో షర్మిల పార్టీ వ్యవహరాలు చూసుకున్నారు. ఆసమయంలో నేను జగనన్న వదిలిన బాణంను నేను మీ రాజన్న కూతురును అంటూ చెప్పుకొచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే తెలంగాణలో పార్టీ కోసం మాత్రం తాను జగనన్న వదిలిన బాణంను అనే పదం వదిలేసి మీ రాజన్న కూతురును, మీ తెలంగాణ ఇంటి కోడలిని అంటూ చెబుతూ వస్తోంది. ఈసారి ఈమె వెనుక ఉన్నది జగన్ కాదు అనేది కొందరు బలంగా వినిపిస్తున్న వాదన, ఇప్పటికే ఏపీలో జగనన్నకు పెనం మీద కాలుతున్నట్లుగా పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో షర్మిలను తెలంగాణకు వదలడం అనేది నిజం కాకపోవచ్చు అంటున్నారు.
షర్మిల పార్టీకి జగన్‌కు సంబంధం లేనట్లే…
షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న పార్టీకి జగన్ కు సంబంధం లేదని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఆయన పావులు కదపాలని అనుకోవడం లేదు. కారణం కేసీఆర్ కు జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీ ప్రకటన జరిగితే అందరితో పాటు కేసీఆర్ కు కూడా ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే కవితను కేసీఆర్ పైకి ఎగదోసే ప్రయత్నం వైఎస్ జగన్ చేయడు అంటూ ఈ సందర్బంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
YS Sharmila : బ్రదర్ అనీల్ ప్రమేయం ఎంత…
తెలంగాణలో ముస్లీంల కోసం ఎంఐఎం అనే ప్రత్యేక పార్టీ ఉంది. కాని క్రైస్తవులకు పార్టీ లేదు. అందుకే బ్రదర్ అనీల్ ఈ పార్టీని షర్మిలతో పెట్టించి క్రైస్తవుల ఓట్లను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో మెజార్టీ క్రైస్తవులు ఉన్న కారణంగా వచ్చే ఎన్నికల్లో వారి ఓటు బ్యాంక్ తో దుమ్ము రేపే విధంగా షర్మిలకు ఓట్ల శాతం దక్కే అవకాశం ఉంది అంటున్నారు. బ్రదర్ అనీల్ తెలంగాణలో పార్టీ గెలిచినా గెలవకున్నా పర్వాలేదు కాని క్రిస్టియన్ శక్తి తెలియాలంటూ భావిస్తున్నాడట. అందుకే స్వయంగా బ్రదర్ అనీల్ ఈ బాణంను వదిలాడు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.