Amazon Great indian festival : అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్ట్ మళ్లీ వచ్చేస్తోంది..కళ్లు చెదిరే ఆఫర్స్ మీకోసం
Amazon Great indian festival : భారతీయ పండుగలను దృష్టిలో పెట్టుకుని అమెరికా ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ మరోసారి గ్రేట్ ఇండియా ఫెస్టివల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. సెప్టెంబర్ 23 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. అయితే, ఈసారి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద భారీ ఆఫర్లు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. రానున్న దసరా పండుగ నేపథ్యంలో గ్రేట్ ఇండియా ఫెస్ట్ వలన భారీ డిస్కౌంట్ ధరలకు వివిధ కంపెనీలకు చెందిన ఉత్పత్తులను తక్కువ ధరకే పొందే అవకాశం ఉంది.
ప్రతి సంవత్సరం దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తాయని అందరికీ తెలిసిందే. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ను తీసుకొస్తుంటే అందుకు పోటీగా అమెజాన్ వాడు గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించాడు. ఈ నెల 23న ఈ సేల్ ప్రారంభం కానుంది.
Amazon Great indian festival : అస్సలు మిస్ కావొద్దు..
ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, దుస్తులు, ఫర్నిచర్ ఇలా అన్ని రకాల ఉత్పత్తులపైనా మంచి భారీ తగ్గింపు ధరలు అందుబాటులోకి రానున్నాయి.సాధారణ రోజులతో పోలిస్తే గ్రేట్ ఇండియా ఫెస్టివల్ లో ధరలు కొంత తక్కువగా, డిస్కౌంట్ తో లభిస్తుంటాయి. దీనికితోడు ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తగ్గింపును అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తోంది.
ఈసారి గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఐఫోన్ 13, ఐక్యూ 9టీపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని తెలుస్తోంది.అన్ని డిస్కౌంట్స్ పోను ఐఫోన్ -13 రూ.53 నుంచి 54వేల వరకు రావచ్చు. శామ్‌సంగ్ ఎం52 5జీ రూ.15 వేలకే లభించనుందట.. ఇంకా అమెజాన్ డీల్స్ గురించి కచ్చితమైన సమాచారం త్వరలోనే బయటకు రానుంది.