Health Problems : అరటి పండు, బొప్పాయి కలిపి తింటున్నారా? అయితే జాగ్రత్త..
Health Problems: కరోనా టైం నుంచి చాలా మంది ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహిస్తున్నారు. దాదాపుగా జంక్ ఫుడ్ ను వీలైనంత వరకు తగ్గించి ఫ్రూట్స్ పై దృష్టి పెడుతున్నారు. వీలైనప్పుడల్లా ఫ్రూట్స్ తింటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు సైతం ఇదే సూచిస్తున్నారు. ఇక ఫ్రూట్స్ దొరకని వారు రెడిమెడ్ ఫ్రూట్ సలాడ్ ను ఎంచుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. ఫ్రూట్ సలాడ్ లేదా ఫ్రూట్ మిక్స్ తీసుకునే టైంలో అందులో అరటి, బొప్పాయిని మిక్స్ చేసి చాలా మంది సేల్ చేస్తూ ఉంటారు.
ఇలాంటివి తినే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ముప్పు తప్పదు.అరటి పండులో, బొప్పాయిలో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల కొందరిలో ఇబ్బందులు తలెత్తుతాయి. అందరిలో అని చెప్పలేము. అది పూర్తిగా సదరు వ్యక్తి జీర్ణవ్యవస్థపై డిపెండ్ అయి ఉంటుంది. కొందరిలో జీర్ణ శక్తి సరిగ్గా ఉండదు. అలాంటి వారు అరటి, బొప్పాయి పండు కలిపి తింటే వారిలో సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంది. జీర్ణ శక్తి బాగున్న వారికి ఎలాంటి సమస్య ఉండదు.
Health Problems : కలిపి తింటే ఏమౌతుందంటే..?
వాస్తవానికి ఆయుర్వేదంలో బొప్పాయి, అరటి పండ్లను విరుద్ధమైన పండ్లుగా భావిస్తారు. ఈ రెండింటిని కలిపి తినకూడదని చెబుతుంటారు. కలిపి తింటే వాంతులు, వికారం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యల వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. బొప్పాయి, అరటి పండు రెండింటినీ కలిపి తినడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయట. కామెర్లతో బాధపడే వారు బొప్పాయికి దూరంగా ఉండాలి. మరి ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ మిక్స్ తినే సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పక పాటించండి. ఫలితంగా హెల్త్ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.