Bheemla Nayak : భీమ్లా నాయక్ పంచాయితీ.. సీన్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ పేరు..
Bheemla Nayak : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ మూవీ కోసం ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద క్యూ కడుతున్నారు. తెలంగాణలో ఎక్స్ ట్రా షోలకు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే.. ఏపీలో బ్లాక్ మార్కెట్ ను నివారించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై మంత్రి పెర్ని నాని స్పందించారు. భీమ్లా నాయక్ మూవీని తొక్కేస్తున్నామని కొందరు అంటున్నారని సీరియస్ అయ్యరు. మూవీని తొక్కెయ్యడానికి ఎలా వీలవుతుందని ప్రశ్నించారు. మూవీ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పుకొచ్చారు. బ్లాక్ టికెటింగ్‌ను రూపు మాపేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు.
కానీ ప్రతిపక్ష నాయకులు బ్లాక్ మార్కెటింగ్ ను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. బ్లాక్ మార్కెటింగ్ ను మీడియా తప్పు పట్టాల్సింది పోయి కొన్నింటిలో దానికి అనుకూలంగా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు.టికెట్ ధరల జీవోను నిలిపి కలెక్టర్లను సంప్రదించి ధరల పెంపుపై అనుమతి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పిందని పెర్ని నాని గుర్తుచేశారు. కానీ ఎందుకు అలా చేయడం లేదని ప్రశ్నించారు. కోర్టు, ప్రభుత్వం అంటే లెక్కలేదా అని సీరియస్ అయ్యారు. అంతా మా ఇష్టారాజ్యం అంటే కుదురుతుందా? అని అన్నారు. మూవీ టికెట్స్ కు సంబంధించిన జీవోను లేట్ గా విడుదల చేశామని అంటున్నారని,
Bheemla Nayak : కోర్టు, ప్రభుత్వం అంటే లెక్కలేదా?
దీనిని ఈ నెల 21న కమిటీతో భేటీ అయ్యామని, 22న హోం సెక్రెటరీ డ్రాఫ్ట్ ను రూపొందించి దానిని లా కమిషన్ కు పంపించామన్నారు. 23 లేదా 24 వ తేదీన దానిని రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ మంత్రి గౌతమ్ రెడ్డి చనిపోవడం వల్ల ఆలస్యమైందని తెలిపారు. భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ కు ముందే సినిమా బాగుందని నారా లోకేశ్ అంటున్నాడని, మూవీ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నానని చెబుతున్నారని, మరి జూనియర్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అవుతుంటే ఇలా ఎప్పుడైనా అన్నారా? అంటూ ప్రశ్నించారు.