Hyderabad rain : హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఈ ఏరియాల్లోనే ఎక్కువ
Hyderabad rain : వర్షాలు మళ్లీ దంచికొడుతున్నాయి. ఇప్పటికే వర్షాలతో నానా ఇబ్బందులు పడ్డ ప్రజలు మరోసారి తిప్పలు తప్పట్లేదు. అయితే వర్షాలతో అందరికంటే ఎక్కువగా హైదరాబాద్ ప్రజలే ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. చిన్న పాటి వర్షానికే హైదరాబాద్ మొత్తం వరద నీటితో నిండిపోతోంది.

Havey rain in Hyderabad
ఇలాంటి తరుణంలో మొన్న పడ్డ వర్షాలకు అన్ని ఏరియాలు నీట మునిగిపోఆయయి. దాంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. అయితే ఈ ఘటనలు మరువక ముందే ఇప్పుడు మరోసారి ఈ రోజు ఉదయం నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. భారీగా వర్షాలు కురవడంతో జనాలు మళ్లీ ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఉదయం నుంచి ఎక్కువగా పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్ రోడ్, రాం నగర్, మాదాపూర్, సికింద్రాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ ఏరియాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ ఆఫీసర్లు సూచిస్తున్నారు. అత్యవసరం అనుకుంటేనే బయటకు రావాలంటూ సూచిస్తున్నారు. అల్ప పీడనం తగ్గే వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు.