Viral Video : పిల్లల కోసం గద్దతో కోడి పోరాటం.. అమ్మ ప్రేమ అంటే అదే మరి..!
Viral Video : అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం.. నవ మాసాలు మోసి పెంచి పెద్ద చేసిన మాతృమూర్తి పాదాలు కడిగి, ఆమెను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని పెద్దలు చెప్తుంటారు. అది నిజం కూడా. కేవలం మనుషుల విషయంలోనే కాదు జంతువుల విషయంలోనూ అమ్మ ప్రేమ గొప్పది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
Viral Video : తన పిల్లల రక్షణ కోసం గద్ధతో తల్లికోడి భీకర పోరాటం..

Hen fight with Egal Viral video
ఫిజెన్ సెజిన్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన సదరు వీడియోలో.. ఓ తల్లి కోడి తన పిల్లలతో కలిసి ఖాళీ ప్రదేశంలో తిరుగుతోంది. ఆహార వేటలో భాగంగా కోడి తన పిల్లలతో వెళ్తోంది. ఇంతలోనే గద్ద గాలిలో నుంచి భూమ్మీదకు ల్యాండ్ అయి కోడి పిల్లలను కరుచుకుపోయి ప్రయత్నం చేయబోయింది. దాంతో వెంటనే తల్లి కోడి గద్ధతో పోరుకు సిద్ధమైంది. గద్ధ చుట్టూత తిరుగుతూ దానిని కోడి పిల్లలపై దాడి చేయకుండా అడ్డుకుంది.
ఈ క్రమంలోనే గద్ద తన తలను 270 డిగ్రీల యాంగిల్‌లో తిప్పి మరి తల్లి కోడిపై దాడి చేసేందుకుగాను ప్రయత్నించింది. అయినప్పటికీ దాని వల్ల కాలేదు. మొత్తానికి తల్లి కోడి తన పిల్లలను కాపాడి తన తల్లి ప్రేమను నిరూపించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ప్రజెంట్ బాగా వైరలవుతోంది. ఈ వీడియో చూసి ఆ కోడి నిజమైన అమ్మ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు ప్రతీ ఒక్కరు తమ తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
She is a Mom ???? pic.twitter.com/ZiTJfuL261
— Figen Sezgin (@_figensezgin) November 17, 2021