ప్రపంచంలోనే లగ్జరీ జైలు.. ఆశ్చర్యపరిచే సంగతులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ప్రపంచంలోనే లగ్జరీ జైలు.. ఆశ్చర్యపరిచే సంగతులు

 Authored By brahma | The Telugu News | Updated on :5 March 2021,2:50 pm

luxury prison : మనకి తెలిసి జైలు అనగానే, పొడవైన ఊసలు, గాలి వెలుతురూ సరిగ్గా రాని నాలుగు గోడలు, తినటానికి చిప్పకూడు, చుట్టూ పక్కల తుపాకులతో కాపలాకాసే పోలీసులు గుర్తుకు వస్తారు. పైగా నిద్రపట్టకుండా చేసే దోమలు, దుర్గంధం వెదచల్లే రూములు గుర్తొచ్చి జైలు అంటేనే ఒక దుర్భర జీవితాన్ని ఊహించుకుంటాం. కానీ అది నిజం కాదు అంటున్నారు నార్వే లోని బాస్టాయ్ జైలు అధికారులు.

ఎదో క్షణికావేశంలో తప్పులు చేసి జైలు శిక్ష పడిన ఖైదీలు నిరంతరం తాము చేసింది తప్పే అనే ఆలోచనలో ఉంటారు. అలాంటి స్థితిలో మరింత దుర్భరంగా ఉండే జైళ్లు వారిని మరింతగా కృంగదీస్తాయి. వారిని జంతువులుగా చూసే జైలు అధికారుల మధ్య వాళ్ళు కూడా జంతువులుగా మారిపోతారు. అయితే నార్వే లో మాత్రమే ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. జైళ్ల విషయంలో పూర్తిగా నిబంధనలు మార్చిన తర్వాత అక్కడి జైళ్లు పరిస్థితి మారిపోయింది.

luxury prison in the world surprising things in bastoy prison

luxury prison in the world surprising things in bastoy prison

ఇది కూడా విజయమే

ఇక్కడ జైలులో గడిపిన వాళ్ళు ఆ తర్వాత బయటకు వచ్చి సమాజంలో గౌరవ స్థాయిలో బ్రతకాలని చూస్తున్నారు. దీనితో దేశంలో నేరాల సంఖ్య పడిపోయింది. ఇది ఒక రకంగా తమ విజయమే అని జైళ్లు శాఖ అధికారులు చెపుతున్నారు. నార్వే లోని బాస్టాయ్ జైలులో కటకటాల గదులు వుండవు, చిన్న డబుల్ బెడ్ రూమ్ గదులు ఉంటాయి. ఖైదీలు తమకు ఇష్టమైన గదుల్లో ఉండవచ్చు. విశ్రాంతి తీసుకోని బయటకు వెళ్లి తమ తమ పనులు చేసుకొని తిరిగి జైలుకు వచ్చి భోజనం చేసి నిద్ర పోతారు.

ఇక్కడి ఖైదీలు సముద్రానికి వెళ్లి చేపలు పట్టవచ్చు, సమీప గ్రౌండ్ కి వెళ్లి ఫుడ్ బాల్ ఆడుకోవచ్చు. జైలు సిబ్బంది కాపలా కూడా తక్కువే ఉంటుంది, కాకపోతే సీసీ కెమెరాల నిఘా ఉంటుంది తప్ప, ఖైదీలను అణచివేసే విధానం వుండాడు. దీనితో జైలులో అన్ని పనులు వంతులు వారీగా వేసుకుంటారు. జైల్లో ప్రత్యేకించి ఎలాంటి బట్టలు వుండవు, ఎవరికీ నచ్చిన బట్టలు వాళ్ళు కొనుక్కొని వేసుకోవచ్చు. ఇక బంధువులు వస్తే దూరం దూరంగా ఉంది మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. వారికీ గదులు కేటాయిస్తారు. వాళ్లతో ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది.

bastory prison 2

అయితే ఖైదీలకు ఇలాంటి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాటిని దుర్వినియోగం చేయటం లాంటిది సాధారణంగా జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం అలాంటివి ఏమి లేవు. ఖైదీలు చాలా ఫ్రెండ్లీగా, అధికారులతో ఎలాంటి గొడవలు లేకుండా సరదాగా వుంటారు. నార్వే లో ఇలాంటి తరహా జైళ్ళల్లో ఉన్న ఖైదీలకు ప్రత్యేకంగా ఏది చెప్పాల్సిన అవసరం లేదు. జైలు లోకి వచ్చిన వెంటనే అక్కడ ఎలా నడుచుకోవాలో తెలిపే మ్యానువల్ ఉంటుంది. అది చదువుకొని దానికి తగ్గట్లు ఉంటారు.

ఉదయాన్నే లేవటం, కాసేపు జైలు లోని జిమ్ లో వర్కౌట్స్ చేసుకోవటం, టిఫెన్ చేసుకొని, సముద్రపు వడ్డుకు వెళ్లి స్నానాలు చేసుకొని వచ్చి, జైలు రూల్స్ ప్రకారం పశువులను, గుర్రాలను మేతకు తీసుకోని పోవటం, వ్యవసాయ పనులు చేసుకోవటం లాంటివి చేసి మధ్యాహ్నం భోజనం సమయానికి జైలుకు వెళ్లి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోని ఆ తర్వాత తమ తమ పనులకు వెళ్లారు. భోజనం విషయంలో కూడా తమకు నచ్చిన వంట చేసుకొని తినే వెసులుబాటు అక్కడ ఉంటుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ జైలు అని అంటారు

Also read

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది