Mark Zuckerberg: ట్విట్టర్ సీఈవో బాటలో చార్జీల వసూళ్లకు రెడీ అయిన ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్..!!
Mark Zuckerberg: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రభావం గట్టిగా ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో ఏ మూల ఏది జరిగిన నిమిషాలలో తెలిసిపోతూ ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషీస్తూ ఉంది. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. ఈ క్రమంలో వీటి యాజమాన్యాలు సొమ్ములు చేసుకోవటానికి ఇటీవల పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు.
కొద్ది నెలల క్రితం ట్విట్టర్ సీఈవో ఎలాన్ మాస్క్ బ్లూటిక్ కలిగిన వాళ్లు కచ్చితంగా ఛార్జ్ చెల్లించాలని కొత్త రూల్ తీసుకురావడం తెలిసిందే. కాగా ఇప్పుడు ట్విట్టర్ సీఈవో బాటలో.. ఫేస్బుక్ అధినేత జుకర్ బర్గ్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. విషయంలోకి వెళ్తే త్వరలో ఫేస్ బుక్ లో బ్లూటిక్ హోల్డర్ లు కలిగిన వారు ప్రతి నెల చార్జీలు చెల్లించే రీతిలో సరికొత్త నిబంధనలు తీసుకురాబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా మార్క్ జుకర్ బర్గ్ ప్రకటన చేయడం జరిగింది.
ప్రభుత్వ ఐడీలతో ఫేస్ బుక్ బ్లూ టిక్ హోల్డర్ల అకౌంట్ ల పరిశీలన చేయనున్నారట. తొలుత ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ దేశాలలో ఈ వెరిఫికేషన్ చార్జీలు అమలు చేయనున్నారట. ఆ తరువాత మిగతా దేశాలలో బ్లూటిక్ యూజర్ చార్జీలు అమల్లోకి తీసుకురానున్నారట. ఐఓఎస్ యూజర్ల నుంచి నెలకు 14.99 డాలర్లు వసూలు…వెబ్ యూజర్ల నుంచి నెలకు 11.99 డాలర్లు వసూలు… చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.