KONDA SUREKHA : బుల్లెట్ బండిపై వచ్చి సురేఖకు ప్రపొజ్ చేసిన మురళి.. ఏంచెప్పాడంటే?[
KONDA SUREKHA : కొండా దంపతుల గురించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరినీ అడిగినా చెబుతారు. కొత్తగా పరిచయం అవసరం లేదు. చాలా మందికి కొండా దంపతులు అనగానే తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ నాయకులు అనుకుంటారు. కానీ, ఒకప్పుడు వీరి మావోయిస్టులతో కలిసి పనిచేశారని తెలుసా..వారితో ప్రత్యక్ష సంబంధాలున్నాయని తెలుసా.. కొండా మురళి సురేఖను వివాహం ఆడే కంటే ముందు మావోయిస్టు ఆగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కేతో సన్నిహిత సంబంధాలున్నాయని చాలా మందికి తెలియదు. ఆర్కే మరణం తర్వాత కొండా మురళి జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఎలా పొలిటికల్ లీడర్‌గా ఎదిగారో అనేది చాలా మందికి తెలియదు.
KONDA SUREKHA : అయితే, కొండా దంపతుల జీవిత చరిత్రను వెండి తెరపై ఆవిష్కరించేందుకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందుకొచ్చారు. ఇప్పటికే కొండా దంపతుల నుంచి ఆయనకు అనుమతి కూడా లభించింది. వారి జీవిత చరిత్రను సినిమా రూపంలో తీసుకొస్తున్నట్టు ఇటీవలే ఆర్జీవీ యూట్యూబ్ ద్వారా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం ఆర్జీవీ కొండా దంపతుల ఇంటికి వెళ్లగా ఆయనకు ఘన స్వాగతం లభించింది.
KONDA SUREKHA : తాజాగా కొండా సురేఖ దంపతులు దర్శకుడు ఆర్జీవీతో కలిసి వరంగల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ తమ లవ్ స్టోరీని రివీల్ చేసింది. అప్పట్లో తనకు మురళి ఎలా పరిచయం అయ్యాడు. ఎలా ప్రపోస్ చేశాడనే విషయాన్ని అభిమానులతో పంచుకుంది. మొదట్లో మురళి తన వెంట పడేవాడని, తాను ఎక్కడకు వెళ్ళినా ఫాలో అయ్యేవాడని తెలిపింది.ఓ రోజు నేరుగా వచ్చి తన నెంబర్ ఇచ్చాడని.. ఆ తర్వాత కొన్నిరోజులకు నేరుగా బుల్లెట్ బండి మీద వచ్చి నేను నిన్ను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నట్టు డైరెక్ట్‌గా చెప్పాడని తెలిసింది. అయితే, ఆ రోజుల్లో కులాంతర వివాహం అంత ఈజీ కాదని, కానీ మురళి తన తల్లిదండ్రులతో ధైర్యంగా మాట్లాడి నన్ను తిరుపతికి తీసుకెళ్ళి పెళ్లాడినట్టు తెలిపింది. అంతేకాకుండా నేటి యువతకు కొండా సురేఖ అమూల్య మాటలు చెప్పింది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు తల్లిదండ్రుల అనమతితోనే కొత్త జీవితం ప్రారంభించాలని, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని సూచించింది. కొండా దంపతులకు చెందిన మిగతా స్టోరీని అందరూ స్క్రీన్ పై చూడాలని తమ అభిమానులను కోరింది.