Expert solution for couple life : నా భార్య ప్రెగ్నెంట్.. నాకు దానికి ఏ సంబంధం లేదు?
Expert solution for couple life : ప్రశ్న : మాకు రీసెంట్‌గా వివాహం జరిగింది. కానీ నా భార్యతో నేను కాపురం చేయక చాలా రోజులు అవుతుంది. అనుకోకుండా నా భార్య గర్భవతి అయ్యింది. ఈ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. రేపు పుట్టబోయే బిడ్డకు నాకు సంబంధం లేదు.నేను దానిని అంగీకరించ లేకపోతున్నాను. ఈ విషయం బయట తెలిస్తే నా పరువు, నా కుటుంబం పరువు ఏం కావాలి. ఈ సమస్యను ఎలా అధిగమించాలి.
ఎక్సపర్ట్ సమాధానం : నిజంగా మీ భార్య గర్భవతి అవ్వడానికి మీకు సంబంధం లేదని భావిస్తే ఈ తప్పు ఎలా జరిగిందో ముందు తెలుసుకోండి.సీరియస్‌గా నిర్ణయాలు తీసుకోకండి.. మీ భార్యను కూర్చోబెట్టి ఓపికగా అడుగండి. అసలు ఏం జరిగింది అని.. తను నిజం చెప్పేలా మీపై నమ్మకం కలిగించే ప్రయత్నం చేయండి.. నిజంగా మీ భార్య తప్పు చేసిందని బయట తెలిస్తే మీ పరువు, ఫ్యామిలీ పరువు ఏమవుతుందని అర్థం అయ్యేలా చెప్పండి..
Expert solution for couple life : ఒక్క అవకాశం ఇవ్వండి..
మీ భావాలను ఆమె అర్థం చేసుకుని నిజంగానే తను తప్పు చేసిందని అంగీకరిస్తే ఆమె ఈ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఓపికగా అడిగి తెలుసుకోండి. మీ భార్య ఇతర పురుషునికి దగ్గర అయ్యిందంటే అందులో మీ తప్పు కూడా ఏమైనా ఉందా? అని ఒక సారి పరిశీలించుకోండి.ఇక చివరగా ఆమెను ఈ ఒక్కసారి మనస్పూర్తిగా క్షమించేందుకు ప్రయత్నించండి. మనుషులు తప్పు చేయడం సహజం. కానీ వారికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. ఒకసారి చేసిన తప్పుకు లైఫ్ అంతా శిక్ష విధించడం సరికాదు. మళ్లీ మళ్లీ ఆ తప్పుడు రిపీట్ అవుతే అప్పుడు మీకు నచ్చిన డెసిషన్ తీసుకోవచ్చు. కుటుంబసభ్యులతో చర్చించి ఏదో ఒక పరిష్కార మార్గం వెతకవచ్చు.ఇక పుట్టబోయే బిడ్డను మీ బిడ్డగా బయట చెప్పుకోవడానికి ధైర్యం చేయగలరా? అనేది కూడా మీ నిర్ణయమే అవుతుంది. సంసారంలో గొడవలు జరిగినపుడు ఇద్దరి మధ్య దూరం పెరగకుండా చూసుకోవాలి. అప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.