Liger : విజయ్ దేవరకొండ కి సాలీడ్ టైటిల్ ఫిక్స్ చేసిన పూరి జగన్నాధ్ ..!

Authored By vamana sai | The Telugu News | Published on: January 18, 2021, 10:21 am

ప్రస్తుతం విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందే షూటింగ్ మొదలైన ఈ సినిమా ముంబై ధారావి లో కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పూరి కనెక్ట్స్ – ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది.

puri jagannaadh vijay devarakonda Movie Title Liger fixed

puri jagannaadh vijay devarakonda Movie Title Liger fixed

ఫైట‌ర్ అని క‌న్యూప్యీజ్ చేసిన లైగ‌ర్ ఫిక్స్ అయిన  పూరి జగన్నాధ్

కాగా ఈ సినిమా దర్శకుడిగా పూరి జగన్నాధ్ కి అలాగే హీరోగా విజయ్ దేవరకొండ కి ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. అందుకే పూరి జగన్నాధ్ ఈ సినిమాని యూనివర్సల్ కాసెప్ట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి జగన్నాధ్ మళ్ళీ ఫాం లోకి వచ్చి తెరకెక్కిస్తున్న సినిమా. అలాగే విజయ్ దేవరకొండ గత రెండు చిత్రాలు భారీ డిజాస్టర్స్ గా మిగలడం తో ఈ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. అయితే అన్ని సినిమాలు అన్ లాక్ తర్వాత సెట్స్ మీదకి వచ్చినా ఈ సినిమా మొదలకపోవడం తో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ లో ఉన్నారు.

ఆ డిసప్పాయింట్ మెంట్ ని పోగొట్టడానికి ఈ సినిమా నుంచి తాజా టైటిల్ తో పాటు విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ‘ లైగర్ ‘ అన్న టైటిల్ ని ఫిక్స్ చేసిన పూరి టీం విజయ్ దేవరకొండ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ తో సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp