Rajamouli ఆ విషయంపై ప్రకటనా?.. RRR ట్వీట్ వైరల్
Rajamouli RRR Movie దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. బాహుబలి తరువాత రాజమౌళి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. అందుకే తాను తెరకెక్కించే సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నాడు. అందుకు రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్లార్లను పెట్టేసి సినిమాను తీస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లతో ఆర్ఆర్ఆర్‌పై అంచనాలు ఆకాశన్నంటాయి.

Rajamouli Ram Charan NTR RRR Movie Updates on 25th january
మొదటి నుంచి కూడా ఈ సినిమాకు అన్నీ ప్రతికూల అంశాలే ఎదురవుతూ వచ్చాయి. సినిమాను ఆలస్యమవుతూనే వస్తోంది. వాయిదాలు పడుతూనే ఉంటోంది. హీరోలకు గాయాలవ్వడం, షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ అవుతూ వస్తున్నాయి. అలా చివరకు కరోనా, లాక్డౌన్ వంటివి రావడంతో సినిమా పూర్తిగా అటకెక్కిసింది. ఇప్పటికే రెండు విడుదల తేదీలు ప్రకటించి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అన్ లాక్ ప్రక్రియ తరువాత షూటింగ్‌లు చేశారు. కానీ మధ్యలో దర్శకుడు, హీరోకు కరోనా రావడంతో మరింత ఆలస్యమైంది.
RRR Movie అక్టోబర్ 8న విడుదల
మొత్తానికి క్లైమాక్స్ షూటింగ్‌ను ప్రారంభించారు. ఇక త్వరలోనే షూటింగ్ మొత్తం పూర్తి కాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ లీకైంది. అక్టోబర్ 8న విడుదల కాబోతోందని బయటకు వచ్చింది. అయితే ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిద్దామని ఆర్ఆర్ఆర్ యూనిట్ భావించినట్టుంది. అందుకే నేటి మధ్యాహ్నం రెండు గంటలకు అప్డేట్ రాబోతోందంటూ ఆర్ఆర్ఆర్ ప్రకటించింది. మరి ఇంతకీ ఆ అప్డేట్ ఏంటో చూడాలి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి పోరాటం చేస్తోన్న టీజర్‌ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.