Rakul Preet Singh : అమ్మ బాబోయ్ ఎంతలా కష్టపడుతోంది.. రకుల్ ప్రీత్ సింగ్ వర్కవుట్ వీడియో వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: January 20, 2021, 2:13 pm

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్‌ తన ఫిట్ నెస్‌కు ఎంతలా ప్రాధాన్యతను ఇస్తుందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు చబ్బీగా ఉండే రకుల్ ఇప్పుడు మాత్రం బక్కపల్చగా తయారైపోయింది. ఒకానొక సమయంలో రకుల్ ప్రీత్ సింగ్‌ ను గుర్తు పట్టడం కూడా కష్టమే అయింది. అంతలా తన శరీరాకృతిని మార్చుకుంది. పూర్తిగా జీరో సైజ్‌లోకి మారడంతో కొందరు అభిమానులు పెదవి విరిచారు. చబ్బీగా ఉన్నప్పుడే బాగున్నావ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టేవారు. అయినా కూడా రకుల్ ప్రీత్ సింగ్‌ మాత్రం తన జిమ్, వ్యాయమాన్ని వదిలిపెట్టేది కాదు.

Rakul Preet Singh Workout Video goes viral

Rakul Preet Singh Workout Video goes viral

కోలీవుడ్ బిజి బిజి : రకుల్ ప్రీత్ సింగ్

మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్‌ మాత్రం ఎప్పుడూ కూడా వర్కవుట్లతో బిజీగానేఉంటుది. షూటింగ్ ఉన్నా లేకపోయినా కూడా వర్కవుట్లు చేయడం మాత్రం మానదు. మొన్నామధ్య ఏకంగా రకుల్ వర్కవుట్ చేసుకుంటూనే షూటింగ్ స్పాట్‌కు వెళ్లింది. సైక్లింగ్ చేసుకుంటూ సెట్‌కు వెళ్లాను.. టైం కలిసి వస్తుంది కదా అంటూ చెప్పుకొచ్చింది. రకుల్ ఇప్పుడు కోలీవుడ్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. శివ కార్తికేయన్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్‌ హీరోయిన్‌గా చేస్తుంది. ఇక చివరి షెడ్యూల్ అని త్వరలోనే ఇది కూడా పూర్తి కాబోతోందని చెప్పుకొచ్చింది.

అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్‌ కష్టపడుతున్న తీరు చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. కిందకు మీదకు లేస్తూ ఉన్న వర్కవుట్ గురించి చెబుతూ.. జీవితమంటే కూడా ఇలానే ఉంటుందని రకుల్ ప్రీత్ సింగ్‌ చెప్పుకొచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్‌ ఇప్పుడు అయలాన్ అనే కోలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఇంకో రెండు రోజుల్లో ఆ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోందని ప్రకటించింది. ఆ తరువాత మేడే సినిమా షూటింగ్‌లో రకుల్ ప్రీత్ సింగ్‌ పాల్గొనబోతోన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రకుల్ అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా ఫుల్ బిజీగా ఉంటోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp