Honey : ఆయుర్వేదం వైధ్యం చేసే వారు ప్రతి ఒక్కరు కూడా తేనెను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సహజ సిద్దమైన తేనెను వాడితే తగ్గుతాయని అంటారు. ఇక తేనెతో ఎన్నో ఔషదాలను తయారు చేస్తారు అనడంలో సందేహం లేదు. తేనెలో ఉండే ఔషదగుణం వల్ల ఎంతో కాస్ట్ ఉంటుంది. అడవిలో సహజ సిద్దంగా తేనె లభిస్తుంది.
అయితే ఈమద్య కాలంలో తేనెకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో తేనెటీగలను ప్రత్యేకంగా పెంచుతున్నారు. వాటి నుండి తేనేను తీస్తున్నారు. సాదారణంగా అయితే మంచి తేనె కేజీ 500 నుండి 1000 వరకు ఉంటుంది. కాని టర్కీలోని సెంటౌరీ హనీ కంపెనీ తాము ఉత్పత్తి చేస్తున్న తేనెను ఏకంగా కిలో 8.6 లక్షల రూపాయలకు అమ్ముతున్నారు. ఈ రేటును గిన్నీస్ రికార్డు కూడా దృవీకరించింది.
ప్రపంచంలో ఎక్కడ లేనంతగా ఈ తేనెకు రికార్డు స్థాయి ధర పలుకుతోంది. అందుకే ఈ రేటుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారు నమోదు చేయడం జరిగింది. గిన్నీస్ బుక్ అధికారిక వెబ్ సెట్ లో పేర్కొన్న కథనం ప్రకారం సదరు కంపెనీ తయారు చేసిన ఈ తేనెకు అత్యధిక ఔషద గుణం ఉందని నిర్థారణ అయ్యింది.
అందుకే గిన్నీస్ బుక్ వారు ఈ రికార్డును నమోదు చేశారట. గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు వారు ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన తేనెగా దీనికి గుర్తింపు ఇవ్వడం వల్ల ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ తెనకు డిమాండ్ ఉంది.
ఆ తేనెకు ప్రపంచంలోనే అత్యంత ప్రభావమైన ఔషదగుణం ఉంది. దానికి కారణం సముద్ర మట్టంకు దాదాపుగా 2500 మీటర్ల ఎత్తులో ఒక గుహ ఉంది. అక్కడ కనీసం జనసంచారం ఉండదు. ఆ గుహ చుట్టు ఔషదగుణాలు ఉన్న చెట్లు మొక్కలు ఉంటాయి.
వాటి నుండి మకరందంను స్వీకరించి తేనె టీగలు తేనెను విడుదల చేస్తాయి. అందుకే ఆ తేనెకు అద్బుతమైన ఔషద గుణాలు ఉంటాయని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ తేనే కోసం ఆర్డర్ లు నమోదు అవుతున్నాయి. నిల్వ శక్తి కూడా ఎక్కువగా ఈ తేనెకు ఉందని చెబుతున్నారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.