Honey : ఆ తేనె కిలో ధర రూ.8.6 లక్షలు, అంత ప్రత్యేకం ఏంటో చూద్దాం రండీ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Honey : ఆ తేనె కిలో ధర రూ.8.6 లక్షలు, అంత ప్రత్యేకం ఏంటో చూద్దాం రండీ!

 Authored By himanshi | The Telugu News | Updated on :27 March 2021,7:59 pm

Honey : ఆయుర్వేదం వైధ్యం చేసే వారు ప్రతి ఒక్కరు కూడా తేనెను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సహజ సిద్దమైన తేనెను వాడితే తగ్గుతాయని అంటారు. ఇక తేనెతో ఎన్నో ఔషదాలను తయారు చేస్తారు అనడంలో సందేహం లేదు. తేనెలో ఉండే ఔషదగుణం వల్ల ఎంతో కాస్ట్‌ ఉంటుంది. అడవిలో సహజ సిద్దంగా తేనె లభిస్తుంది.

అయితే ఈమద్య కాలంలో తేనెకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో తేనెటీగలను ప్రత్యేకంగా పెంచుతున్నారు. వాటి నుండి తేనేను తీస్తున్నారు. సాదారణంగా అయితే మంచి తేనె కేజీ 500 నుండి 1000 వరకు ఉంటుంది. కాని టర్కీలోని సెంటౌరీ హనీ కంపెనీ తాము ఉత్పత్తి చేస్తున్న తేనెను ఏకంగా కిలో 8.6 లక్షల రూపాయలకు అమ్ముతున్నారు. ఈ రేటును గిన్నీస్ రికార్డు కూడా దృవీకరించింది.

Honey : తేనె రేటుకు గిన్నీస్‌ రికార్డ్‌..

ప్రపంచంలో ఎక్కడ లేనంతగా ఈ తేనెకు రికార్డు స్థాయి ధర పలుకుతోంది. అందుకే ఈ రేటుకు గిన్నీస్‌ బుక్ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు వారు నమోదు చేయడం జరిగింది. గిన్నీస్ బుక్‌ అధికారిక వెబ్‌ సెట్‌ లో పేర్కొన్న కథనం ప్రకారం సదరు కంపెనీ తయారు చేసిన ఈ తేనెకు అత్యధిక ఔషద గుణం ఉందని నిర్థారణ అయ్యింది.

turkey honey

turkey honey

అందుకే గిన్నీస్ బుక్ వారు ఈ రికార్డును నమోదు చేశారట. గిన్నీస్ బుక్ ఆఫ్‌ ది వరల్డ్‌ రికార్డు వారు ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన తేనెగా దీనికి గుర్తింపు ఇవ్వడం వల్ల ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ తెనకు డిమాండ్‌ ఉంది.

Honey : ఔషద గుణంకు కారణం ఇదే..

ఆ తేనెకు ప్రపంచంలోనే అత్యంత ప్రభావమైన ఔషదగుణం ఉంది. దానికి కారణం సముద్ర మట్టంకు దాదాపుగా 2500 మీటర్ల ఎత్తులో ఒక గుహ ఉంది. అక్కడ కనీసం జనసంచారం ఉండదు. ఆ గుహ చుట్టు ఔషదగుణాలు ఉన్న చెట్లు మొక్కలు ఉంటాయి.

వాటి నుండి మకరందంను స్వీకరించి తేనె టీగలు తేనెను విడుదల చేస్తాయి. అందుకే ఆ తేనెకు అద్బుతమైన ఔషద గుణాలు ఉంటాయని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ తేనే కోసం ఆర్డర్‌ లు నమోదు అవుతున్నాయి. నిల్వ శక్తి కూడా ఎక్కువగా ఈ తేనెకు ఉందని చెబుతున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది