Viral Video : పిల్లిని మోసం చేసిన కాకులు.. నవ్వి నవ్వి పొట్ట చెక్కలవ్వాల్సిందే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పిల్లిని మోసం చేసిన కాకులు.. నవ్వి నవ్వి పొట్ట చెక్కలవ్వాల్సిందే…

 Authored By mallesh | The Telugu News | Updated on :24 February 2022,7:00 am

Viral Video : మన చుట్టూ చాలా మంది చాలా మందిని మోసం చేస్తుంటారు. మోసం చేసేందుకు చాలా మంది ట్రై చేస్తుంటారు. మనుషులు కాదు జంతువులు, పక్షులు సైతం ఈ టెక్నిక్ ను యూజ్ చేస్తున్నాయి. ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలగక మానదు. ఇక ఈ వీడియోను చూసిన వారు నవ్వకుండా ఉండలేదు. చాలా అరుదుగా కనిపించే ఇలాంటి వీడియోలను చూసేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఎవరు ఎవరిని మోసం చేశారు? ఎలా మోసం చేశారు?

ఎందుకు మోసం చేశారు? అనే వివరాలు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే మరి.పార్కింగ్ ప్రదేశంలో ఓ పిల్లి తన ఆహారాన్ని తింటుంటుంది. దానిని ఎలాగైనా ఎత్తుకెళ్లాలని రెండు కాకులు ట్రై చేస్తుంటాయి. కానీ పిల్లి వాటిని ఆ చాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆ కాకులకు ఓ ఐడియా తట్టింది. అందులో భాగంగానే ఓ కాకి పిల్లికి వెనకాల వైపు ఉండగా, మరో కాకి పిల్లికి ముందు వైపు ఉంది. వెనకాల ఉన్న కాకి పిల్లిని పొడిచి దానికి చిరాకు తెప్పించింది. కోపానికి గురైన పిల్లి ఆహారాన్ని అక్కడే వదిలేసి కాకి వెంట పరిగెత్తింది.

Viral Video cat was deceived at the hands of crows

Viral Video cat was deceived at the hands of crows

Viral Video : పిల్లికి చిరాకు తెప్పించి..

ఇదే టైంలో ముందున్న కాని ఆ ఆహారాన్ని నోటితో పట్టుకుని నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్స్ హ్యాపీగా నవ్వుకుంటున్నారు. ఫన్నీ కామెంట్స్ సైతం పెడుతున్నారు. సుమారు 7 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఇప్పటికే దీనికి 405k పైగా వ్యూవ్స్ వచ్చాయి. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కెయ్యండి.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది