Ys jagan : వైఎస్ జగన్ డిఫరెంట్ స్కెచ్.. ఆ వర్గం వారికే టికెట్..? ఎందుకంటే..!
Ys jagan : వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్, ఏపీ సీఎం జగన్ ఆలోచన చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తనదైన శైలిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల వద్ద ఇంప్రెషన్ కొట్టేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయన వేసే స్కెచ్ చాలా మందికి తొందరగా అర్థం కాదు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ఆయన స్కెచ్ వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయిలో ప్రజల్లోనే ఉన్నారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోయినా.. ఆయన పెడుతున్న స్కీమ్స్.. విడుదల చేస్తున్న ఫండ్ జనానికి అందుతున్నాయి. దాదాపుగా జగన్‌ను తప్ప ఎమ్మెల్యేలను, నాయకులను చూడటం లేదు రాష్ట్ర ప్రజలు..
వచ్చే ఎలక్షన్స్‌లో ఎలాగైనా పార్టీని గెలిపించేందుకు జగన్ ఇప్పటి నుంచి ఆలోచనలు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెయిన్‌గా కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ప్లేస్‌లో వారికే టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని టాక్. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఎలాగో కాపులకే టికెట్ ఇవ్వాలి. రాయలసీమ, కోస్తాలో మాత్రం కాపుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. అనంతరపురం పట్టణ కాన్సిటెన్సిలో కాపు వారు ఎక్కువగా ఉంటారు. కానీ, 2 దశాబ్దాల నుంచి ఇక్కడ కమ్మ, రెడ్డి వర్గం నేతలే విజయం సాధిస్తున్నారు. టీడీపీ నుంచి 2014లో ప్రభాకర్ చౌదరి గెలిచారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున అనంత వెంకట్రామిరెడ్డి గెలిచారు.
Ys jagan : నెక్స్ట్ ఎలక్షన్స్‌కు ఇప్పటి నుంచే స్కెచ్
ఇక వచ్చే ఎలక్షన్స్‌లో టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగే చాన్స్ ఉంది. దీంతో ఈ సారి అనంతపురం పట్టణ కాన్సిటెన్సి టికెట్ కాపు వర్గానికి చెందిన వారికే జగన్ కేటాయిస్తారని టాక్. వెంకట్రామిరెడ్డికి రాజ్యసభ పదవి ఇస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాపులో చీలక తెచ్చేందుకే జగన్ ఈ ఎక్పరిమెంట్ చేస్తున్నారని టాక్.