Guppedantha Manasu 17 Nov Today Episode : శైలేంద్ర, దేవయాని నాటకాన్ని ఫణీంద్ర కనిపెడతాడా? ఇక తాగనని రిషి మీద ఒట్టేసిన మహీంద్రా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 17 Nov Today Episode : శైలేంద్ర, దేవయాని నాటకాన్ని ఫణీంద్ర కనిపెడతాడా? ఇక తాగనని రిషి మీద ఒట్టేసిన మహీంద్రా

Guppedantha Manasu 17 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 17 నవంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 923 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నేను మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది అంటుంది అనుపమ. ఇక నుంచి అలా జరగదు. నేను మీతోనే ఉంటాను డాడ్ అంటుంది అనుపమ. మీకు చెప్పకుండా, మీకు దూరంగా ఎక్కడికీ వెళ్లను. కానీ.. ఇప్పుడు […]

 Authored By gatla | The Telugu News | Updated on :17 November 2023,8:40 am

ప్రధానాంశాలు:

  •  ధరణి మీద ప్రేమ ఉన్నట్టుగా నటించిన శైలేంద్ర

  •  శైలేంద్ర నాటకాన్ని ఫణీంద్రా కనిపెడతాడా?

  •  మహీంద్రా మళ్లీ తిరిగి కాలేజీకి వెళ్తాడా?

Guppedantha Manasu 17 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 17 నవంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 923 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నేను మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది అంటుంది అనుపమ. ఇక నుంచి అలా జరగదు. నేను మీతోనే ఉంటాను డాడ్ అంటుంది అనుపమ. మీకు చెప్పకుండా, మీకు దూరంగా ఎక్కడికీ వెళ్లను. కానీ.. ఇప్పుడు నేను వెళ్లాలి డాడ్ అంటుంది అనుపమ. పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చేస్తాను. ప్లీజ్ డాడ్ వద్దని చెప్పొద్దు అంటే సరే అమ్మ అంటాడు విశ్వం. కనీసం ఎక్కడ ఉంటావో అదైనా చెప్పు అంటే.. నాకే తెలియదు డాడ్. ఎందుకు వెళ్తున్నాను అనేది మాత్రమే తెలుసు కానీ.. ఎక్కడికి వెళ్లాలి.. ఎలా నా పని పూర్తి చేసుకోవాలి అనేది తెలియదు అంటుంది అనుపమ. దీంతో నీ గురించి నాకు తెలుసు. నువ్వు చెప్పాలనుకుంటే చెప్తావు.. లేకపోతే లేదు. నీకు తోడుగా ఏంజెల్ ను తీసుకెళ్లు అంటాడు విశ్వం. దీంతో వద్దు డాడ్.. నేను ఒంటరిగానే ఉంటాను అంటుంది అనుపమ. ఒంటరిగా ఎలా ఉంటావు అంటే.. ఒంటరిగా ప్రయాణం చేయడం నాకు కొత్త కాదు డాడ్. ఇన్నాళ్లు ఒంటరిగానే ఉన్నాను. జీవితంలో ఒంటరిగానే మిగిలిపోయాను. నా గురించి మీరు ఆందోళన చెందకండి అంటుంది అనుపమ. నేను నీతో వస్తాను అత్తయ్య అంటుంది ఏంజెల్. దీంతో వద్దు అంటుంది అనుపమ.

తను ఒంటరిగా వెళ్లాలని ఫిక్స్ అయింది. ఇక మనం ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు అంటాడు విశ్వం. అనుపమ.. మీ మేనకోడలికి కూడా నీ బుద్ధులే వస్తున్నాయి అంటాడు విశ్వం. మీ మేనత్తగా, ఒక ఫ్రెండ్ గా నీకు ఒక మంచి మాట చెబుతాను వింటావా అంటుంది. నీ జీవితాన్ని నా జీవితంలా మాత్రం చేసుకోకు అంటుంది అనుపమ. కనీసం ఫోన్ అయినా చేస్తావా అంటే చేస్తా డాడ్ అంటుంది అనుపమ. మరోవైపు ధరణి ఇస్త్రీ చేస్తూ ఉంటుంది. ఇంతలో శైలేంద్ర అక్కడికి వచ్చి అయ్యో ధరణి.. నువ్వెందుకు ఐరన్ చేస్తున్నావు. బయట ఇచ్చే వాడిని కదా. ఇలా చిన్న చిన్నవి కూడా చేస్తే అలిసిపోతావు. అందుకే అన్ని పనులు నువ్వే చేయాల్సిన అవసరం లేదు. ముందు కాఫీ తాగు అంటాడు శైలేంద్ర. దీంతో ధరణికి డౌట్ వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు. ఇది నీకోసం నేను చేశాను. నా స్వహస్తాలతో చేశాను. తీసుకో ధరణి.. అంటాడు శైలేంద్ర. ఎప్పుడూ నువ్వే కాఫీ ఇస్తావా? నేను ఇవ్వకూడదా? అంటాడు. దీంతో అది కాదండి అంటుంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నిన్ను కష్టపెట్టకూడదని డిసైడ్ అయ్యాను. నీకు ఉన్న కోరికలు తీర్చాలని అనుకుంటున్నాను. నిన్ను హ్యాపీగా చూసుకుంటాను ధరణి అంటాడు శైలేంద్ర. ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నారు. ఇందులోనూ ఏదో కుట్ర ఉండి ఉంటుంది అని అనుకుంటుంది ధరణి.

Guppedantha Manasu 17 Nov Today Episode : ఫణీంద్ర ముందు నాటకాలు ఆడిన శైలేంద్ర

నాలో మార్పు రావాలని నాకే అనిపించింది. నిన్న డాడ్ అన్న మాటలు నన్ను కలిచివేశాయి. రాత్రి నిద్ర కూడా పోలేదు. అవే ఆలోచనలు. ఇన్నాళ్లు నిన్ను బాధపెట్టాను. నిన్ను కాదు.. ఎంతో మందిని ఇబ్బంది పెట్టాను. అర్థం అయింది. చాలా తప్పులు చేశాను. చాలా అన్యాయాలు చేశాను. ముఖ్యంగా ఒక భార్యగా నిన్ను గుర్తించలేకపోయాను. వాటన్నింటికీ చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను. సూర్యుడు రాగానే అందరికీ ఉదయం అయితే.. నాకు మాత్రం జానోదయం అయింది అంటాడు శైలేంద్ర. ఇక నుంచి నిన్ను నేను ఒక్క మాట అనను. ఇంకెవరినీ అననివ్వను. మామ్ ను కూడా అననివ్వను.. అంటాడు శైలేంద్ర. ఇవన్నీ ఫణీంద్రా విని సంతోషంగా ఉంటాడు.

ఇంతలో శైలేంద్రా అని పిలుస్తాడు ఫణీంద్రా. డాడ్ ఎప్పుడు వచ్చారు అని అడుగుతాడు. దీంతో నువ్వు మారావా లేదా అనేదే ముఖ్యం అంటాడు ఫణీంద్రా. దీంతో మీ మాటలు నన్ను చాలా కదిలించాయి. నాలో ఉన్న దుర్మార్గుడిని పారద్రోలారు డాడ్. మీరు లెఫ్ట్ లో కొడితే రైట్ లోంచి నా నెగెటివిటీ అంతా పోయింది అంటాడు శైలేంద్ర. నువ్వు తన బాధలు పంచుకోవాలి.. తన సంతోషాలు పంచుకోవాలి. భార్య మీద పెత్తనం చేయకూడదు. తనను గౌరవించాలి అంటాడు ఫణీంద్రా. దీంతో తనకు నచ్చినట్టు ఉంటాను అంటాడు శైలేంద్ర.

మరోవైపు మహీంద్రా మందు తాగకుండా ఉండేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటాడు రిషి. మీరు ఇలా తాగుతూ ఉండకండి డాడ్. నేను సహించను అంటాడు రిషి. దయచేసి మీరు ఎప్పుడూ తాగొద్దు. తాగనని నా మీద ఒట్టేసి చెప్పండి అంటాడు రిషి. నాన్నా రిషి అంటాడు మహీంద్రా. మీరేం మాట్లాడొద్దు. తాగనని నామీద ఒట్టేసి చెప్పండి అంటాడు రిషి. దీంతో తాగను రిషి అంటాడు. ఇంకెప్పుడు తాగను అంటాడు.

దీంతో రిషి, వసుధార సంతోషిస్తారు. రిషి.. మహీంద్రాను హత్తకుంటాడు. మాటిస్తున్నాను రిషి. ఇక నేను తాగను అంటాడు రిషి. దీంతో థాంక్యూ డాడ్. మీరు తాగడం మానేయడమే కాదు. కాలేజీకి రెగ్యులర్ గా వెళ్లాలి. మునుపటిలా మారాలి అంటాడు. ప్లీజ్ మామయ్య.. మీరు కాలేజీకి మళ్లీ రావాలి. కాలేజీలో మీరు ఉండాలి మామయ్య అంటుంది వసుధార. ప్లీజ్ డాడ్ అంటాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది