Guppedantha Manasu 18 Dec Today Episode : శైలేంద్ర గురించి అన్ని విషయాలు ముకుల్ కు చెప్పిన మహీంద్రా, వసుధార.. శైలేంద్రను ముకుల్ అరెస్ట్ చేస్తాడా? ధరణి సాక్ష్యం చెబుతుందా?
Guppedantha Manasu 18 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 18 డిసెంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 949 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు నువ్వు పానకంలో పుడకలా ఎందుకు వచ్చావు అక్కడికి అని అనుపమను అడుగుతాడు మహీంద్రా. దీంతో ఎందుకు అంత ఆవేశపడుతున్నావు మహీంద్రా. కొన్ని మంచినీళ్లు తాగు అంటే.. నాకు మంచినీళ్లు కాదు.. ఫుల్ బాటిల్ మందు తాగినా నా కోపం […]
ప్రధానాంశాలు:
రిషి కారును తీసుకొని వచ్చిన ముకుల్
శైలేంద్రను చంపేసి జైలుకు వెళ్తావా అన్న అనుపమ
రిషి గురించే ఆలోచిస్తూ పిచ్చిదయిన వసుధార
Guppedantha Manasu 18 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 18 డిసెంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 949 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు నువ్వు పానకంలో పుడకలా ఎందుకు వచ్చావు అక్కడికి అని అనుపమను అడుగుతాడు మహీంద్రా. దీంతో ఎందుకు అంత ఆవేశపడుతున్నావు మహీంద్రా. కొన్ని మంచినీళ్లు తాగు అంటే.. నాకు మంచినీళ్లు కాదు.. ఫుల్ బాటిల్ మందు తాగినా నా కోపం తగ్గదు అంటాడు. వాడి లాంటి వాడు అస్సలు బతకకూడదు. ఇంకోసారి నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదు అనుపమ అంటాడు మహీంద్రా. నిన్ను ఎవరు రమ్మన్నారు అక్కడికి అంటే నేనే ఫోన్ చేసి రమ్మన్నాను మామయ్య. నాకు విషయం తెలిసిన తర్వాత మీరు నాకు కంట్రోల్ అవ్వరని తెలిసి మేడమ్ కు ఫోన్ చేసి రమ్మన్నాను అంటుంది వసుధార. ఇప్పటి దాకా నన్ను తిట్టినట్టు వసుధారను తిట్టవు ఎందుకు. నా మీద విరుచుకుపడినట్టు వసుధార మీద విరుచుకుపడవు ఏంటి. నా మీద అంత ఒంటికాలి మీద లేస్తున్నావు. నేను అంటే అంత అలుసు అయ్యానా? ముందు వెనుక లేకుండా అలా ఆవేశపడితే ఎలా? తర్వాత జైలుకు వెళ్లేది నువ్వు. నువ్వు జైలులో కూర్చొంటే వసుధార నీకోసం జైలుకి రావాలా? లేక రిషి కోసం వెతకాలా? ఇప్పటికే రిషి కనిపించక వసుధార చాలా బాధ పడుతోంది. మళ్లీ నువ్వు జైలుకు వెళ్లి ఇంకేం చేద్దామనుకుంటున్నావు అంటుంది అనుపమ.
ఇప్పుడు ఆవేశంలో శైలేంద్రను ఏదైనా చేస్తే మనకే నష్టం అంటుంది వసుధార. రిషి సార్ గురించి మనకు తెలియాలంటే కాస్త ఓపిక పట్టుకోవాలి. ఆ శైలేంద్ర చావడానికి సిద్ధపడ్డాడు కానీ నోరు తెరిచి నిజం చెప్పలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు అంటుంది వసుధార. నిజంగా వాడిని రిషి గురించి తెలిసి ఉంటే చావుకు భయపడి చెప్పి ఉండొచ్చు. కానీ చెప్పలేదు అంటే ఏంటి అని అంటుంది అనుపమ. అవును మామయ్య.. ఏ ప్రూఫ్స్ లేకుండా మనం ముందుకు వెళ్లకూడదు. ముందు మనం రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఆయన ఎక్కడున్నారో సమాచారం లేదు అంటుంది వసుధార. ఆమె బాధ అర్థం అవుతోందా మహీంద్రా. లేదా నీకు ఇష్టం వచ్చినట్టుగా చేయాలని అనుకుంటే వెళ్లి ఆ శైలేంద్రను కాల్చు అంటుంది అనుపమ. దీంతో అందరిని కాదు.. కానీ అమ్మ వసుధార ముందు ఆ ముకుల్ కు ఫోన్ చేయి అమ్మ అంటాడు వసుధార. ఇంతలో రిషి కారు రావడంతో రిషి వచ్చాడని సంబురపడిపోతుంది వసుధార. కారును చూసి బయటికి అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ.. కారులో మాత్రం రిషి ఉండడు. రిషి కారును ముకుల్ వేసుకొని వస్తాడు.
Guppedantha Manasu 18 Dec Today Episode : రిషి కారు తీసుకొని వచ్చిన ముకుల్
ముకుల్ ను చూసి షాక్ అవుతారు. కారు కీ ఇస్తారు. సార్ ఎక్కడ అంటే.. ఆరోజు చెప్పాను కదా సార్. ఔట్ స్కర్ట్స్ లో దొరికింది. ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి తీసుకొచ్చాను. ఆ రోజు కారు దొరికింది కానీ.. రిషి సార్ కు సంబంధించి క్లూస్ ఏం దొరకలేదు. మా కానిస్టేబుల్స్ కూడా మొత్తం వెతికారు అంటాడు ముకుల్. దీంతో ఆ కారు దగ్గరికి వెళ్లి ఆ కారును ఒకసారి చూసుకుంటుంది వసుధార. అమ్మ వసుధార బాధపడకు ఇటురా అంటాడు మహీంద్రా. ముకుల్ లోపలికి రండి అంటాడు మహీంద్రా.
ఏంటి వసుధార మీరు అనేది నిజంగా శైలేంద్ర మీతో అలా అన్నారా అంటే అవును సార్. కాలేజీ సీటు తనకు అప్పగిస్తే రిషి సార్ ఎక్కడున్నారో చెబుతా అన్నారు అంటుంది వసుధార. దీన్ని బట్టి ఒక విషయం అర్థం అవుతోంది.. శైలేంద్రకు ఎండీ సీటు మీద ఆశ ఇంకా ఉందన్నమాట అంటాడు ముకుల్. డైరెక్ట్ గా తన వాయిస్ దొరికినా మ్యాటర్ డైవర్ట్ చేసి ఎస్కేప్ అయ్యాడు.. అంటాడు ముకుల్. ఆ శైలేంద్ర రౌడీలకు డబ్బులు ఇచ్చే విషయం ధరణికి తెలుసు అంటాడు. అలాగే వాడికి వాడే పొడిపించుకున్నాడు కూడా అంటాడు మహీంద్రా.
వాడు ఎంతకైనా తెగిస్తాడు అంటాడు మహీంద్రా. ఇప్పుడు ధరణి ఆ విషయం ధైర్యంగా చెబుతారా అంటే.. దాన్ని బట్టి అరెస్ట్ చేస్తారా? అని అడుగుతుంది అనుపమ. దాన్ని మాత్రమే బేస్ చేసుకొని అరెస్ట్ చేయలేం. ఇవన్నీ జగతి మేడమ్ కేసులో ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడతాయి కానీ.. రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకోలేం. ముందు రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి అంటాడు ముకుల్.
మరోవైపు రిషి గురించే ఆలోచిస్తూ పిచ్చిది అవుతుంది వసుధార. తనకు ఏం చేయాలో అర్థం కాదు. రిషి కారులో కూర్చొని బోరున విలపిస్తుంది. మరోవైపు కాలేజీకి వెళ్తుంది వసుధార. ఒక నోటీసును బోర్డులో పెట్టమని చెబుతుంది వసుధార. మీరు నా పక్కన లేకుంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటుంది వసుధార. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.