Guppedantha Manasu 28 Nov Today Episode : అసలు నిజాలు చెప్పిన చిత్ర.. తామే తప్పు చేశామని ఒప్పుకున్న వాసన్, చిత్ర పేరెంట్స్.. వసుధార సేఫ్.. ఇంతలో ట్విస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 28 Nov Today Episode : అసలు నిజాలు చెప్పిన చిత్ర.. తామే తప్పు చేశామని ఒప్పుకున్న వాసన్, చిత్ర పేరెంట్స్.. వసుధార సేఫ్.. ఇంతలో ట్విస్ట్

Guppedantha Manasu 28 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 28 నవంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 932 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహీంద్రా.. చిత్రను వీల్ చైర్ లో తీసుకొస్తూ ఉంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఫోన్ లో వీడియో చూస్తూ దేవయాని కూడా షాక్ అవుతుంది. సారీ ఎస్ఐ గారు. ఈ అమ్మాయిని రాక్షసుల బారి నుంచి తప్పిస్తూ తీసుకొచ్చే […]

 Authored By gatla | The Telugu News | Updated on :28 November 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  చిత్రను తీసుకొచ్చిన మహీంద్రా

  •  అసలు నిజాలు చెప్పిన చిత్ర

  •  వాసన్ ను కొట్టి కారులో పడేసిన రిషి.. వాసన్ అన్ని నిజాలు చెబుతాడా?

Guppedantha Manasu 28 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 28 నవంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 932 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహీంద్రా.. చిత్రను వీల్ చైర్ లో తీసుకొస్తూ ఉంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఫోన్ లో వీడియో చూస్తూ దేవయాని కూడా షాక్ అవుతుంది. సారీ ఎస్ఐ గారు. ఈ అమ్మాయిని రాక్షసుల బారి నుంచి తప్పిస్తూ తీసుకొచ్చే వరకు కొంచెం లేట్ అయింది అంటాడు. అమ్మ చిత్ర ఇక్కడ అందరికీ నిజాలు తెలియాలి. ఆ నిజం ఏంటో నీ నోటితోనే చెప్పు అంటాడు మహీంద్రా. దీంతో చెప్పమ్మా.. నీకేం భయం లేదు. నువ్వు ఇక్కడ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కారణం వసుధార మేడమేనా అని అడుగుతాడు ఎస్ఐ. దీంతో అలా అని ఎవరు చెప్పారు సార్ అని అడుగుతుంది చిత్ర. దీంతో నువ్వే సూసైడ్ నోట్ రాశావు కదా అంటే.. నేను ఏ సూసైడ్ నోట్ రాయలేదు అంటుంది చిత్ర. దీంతో మరి ఇదేంటమ్మా అని ఆ లెటర్ చూపిస్తాడు ఎస్ఐ. దీంతో ఆ లెటర్ నేను రాయలేదు అంటుంది. ఆ సంతకం నీదే కదా అంటే.. ఆ సంతకం నాదే కానీ.. ఈ లెటర్ నేను రాయలేదు. అసలు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదు అంటుంది చిత్ర. దీంతో అందరూ షాక్ అవుతారు. సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదా? అని అడుగుతాడు.

దీంతో ఏంటమ్మా నువ్వు అలా అంటున్నావు. నువ్వు, వాసు ప్రేమించుకుంటుంటే ఈ మేడమే కదా వచ్చి అడ్డుకుంది. వాసు లేకపోతే నువ్వు బతకలేననే కదా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావు అంటుంది చిత్ర అమ్మ. దీంతో అలా ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మ. అబద్ధం ఎందుకు చెబుతున్నావు అంటుంది. లెటర్ రాయలేదు అనుకుందాం. మరి సీసీ టీవీ ఫుటేజ్ అబద్ధం కాదు కదా. వసుధార మేడమ్ మీకు వార్నింగ్ ఇచ్చినట్టు అందులో కనిపిస్తోంది కదా అంటే వసుధార మేడమ్ నన్ను కలిసిన మాట నిజమే కానీ.. తను నాకు వార్నింగ్ ఇవ్వడానికి రాలేదు సార్ అంటుంది చిత్ర. అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అంటే.. వాసన్ తనను ప్రేమించాలని ప్రతిరోజు వెంటపడేవాడు. మొన్న మా కాలేజీకి వచ్చి గొడవ చేశాడు. దీంతో వాసన్ కి రిషి సార్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే.. ఇంటి వద్ద మా వాళ్లు నాకు తెలియకుండా ఈ ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నాకు తెలియకుండానే నా మొబైల్ నుంచి వసుధార మేడమ్ కు మెసేజ్ వచ్చింది. వెంటనే మేడమ్ నా దగ్గరికి వచ్చింది. అందరికీ సర్దిచెప్పారు మేడమ్ అంటుంది చిత్ర.

Guppedantha Manasu 28 Nov Today Episode : మా అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోయారు అని చెప్పిన చిత్ర

ఆ తర్వాత అంటూ చెప్పలేక ఏడుస్తుంది చిత్ర. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు అంటే ఉన్నట్టుండి నా నోట్లో నుంచి నురగలు వచ్చాయి. కళ్లు తిరిగిపోయాయి. అంతే సార్ అంటుంది చిత్ర. మేడమ్ నన్ను బెదిరించలేదు. నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదు అంటుంది చిత్ర. దీంతో ఎందుకే.. ఎందుకు అబద్ధం చెబుతున్నావు అంటుంది చిత్ర తల్లి. దీంతో నీ వెనుక డిపార్ట్ మెంట్ ఉంది. నువ్వేం భయపడకు అంటాడు. నేను అబద్ధం ఎందుకు చెబుతా అంటుంది చిత్ర. నీ తల్లిదండ్రులు నువ్వే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావు అంటున్నారు కదా అంటే.. వాళ్లు అసలు నా అమ్మానాన్నే కాదు. మా అమ్మానాన్న నా చిన్నప్పుడే చనిపోయారు అంటుంది చిత్ర. అప్పటి నుంచి నేను వీళ్ల దగ్గరే ఉన్నాను. నన్ను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పెట్టారు. భరించాను. కానీ.. ఈసారి ఏకంగా నా ప్రాణాలు తీయాలని చూశారు అంటుంది.

దీంతో ఏంటి చిత్ర నువ్వు ఇలా మారిపోయావు. నేను నిన్ను చంపుకుంటానా? ఈ మాట ఎలా అంటున్నావు అంటుంది చిత్ర తల్లి. ఎస్ఐ గారు వీళ్లే చిత్రను కిడ్నాప్ చేసి తనను బెదిరించారు. అందుకే తను అబద్ధం చెబుతోంది అంటుంది. దీంతో చిత్ర మాత్రం తను చెప్పేదే నిజం అంటోంది కదా. మీరేమో మీరు చెప్పేది నిజం అంటున్నారు. ఇలా అయితే ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అని తేలాలి అంటాడు రిషి. దీంతో చిత్ర చెప్పింది అబద్ధం అనిపిస్తోంది అంటాడు ఎస్ఐ. ఎందుకు అంటే.. సాక్ష్యాలన్నీ వసుధారకు వ్యతిరేకంగా ఉన్నాయి అంటాడు ఎస్ఐ. దీంతో అయితే నేను చిత్ర చెప్పేది నిజం అని చెప్పేందుకు సాక్ష్యం చూపిస్తే నమ్ముతారా అంటే చూపించండి అని అంటాడు ఎస్ఐ.

కారులో కట్టిపడేసిన వాసన్ ను తీసుకొస్తాడు రిషి. వాసన్ ను చూసి చిత్ర తల్లిదండ్రులు షాక్ అవుతారు. రాత్రి ఆసుపత్రిలో చిత్రను ఎందుకు చంపాలని చూశావు చెప్పరా అని అందరి ముందే ప్రశ్నిస్తాడు రిషి. ఇదంతా చూస్తున్న దేవయానికి ఏం చేయాలో అర్థం కాదు. చంపాలనుకున్నావా లేదా చెప్పు అంటే.. చెప్తాను సార్.. చిత్రను చంపాలని అనుకున్నా సార్ అంటాడు వాసన్.

ఎస్ఐ గారు తను చెప్పేది అబద్ధం అంటూ చిత్ర తల్లి అంటుంది. ఈసారే తనను కిడ్నాప్ చేసి అబద్ధం చెప్పిస్తున్నారు అంటుంది. ఇంతలో శైలేంద్రకు ఫోన్ చేస్తుంది దేవయాని. కానీ.. ఫోన్ కలవదు. దీంతో వీడియో సాక్ష్యం చూపిస్తాడు రిషి. దీంతో వాసన్ ను అరెస్ట్ చేస్తాడు ఎస్ఐ. అసలు ఏం జరిగింది అంటే చిత్ర తల్లిదండ్రులు కూడా జరిగింది చెబుతారు.

వసుధారను ఇరికించాలని ఓ వ్యక్తి వచ్చి చిత్ర తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వడంతో ఈ పని చేశామని చెబుతారు. వాసన్ కూడా అక్కడే ఉంటాడు. ఈ ముగ్గురు కలిసి వసుధారను ఇరికించేందుకు ఈ పని చేశాం అని చెబుతారు. మాకు డబ్బులు ఇచ్చాడు. అందుకు మేము ఒప్పుకున్నాం అంటాడు వాసన్. వాళ్ల వెనుక ఎవరు ఉన్నారు పేరు చెప్పు అని అడుగుతాడు రిషి. దీంతో ఎంఎస్ఆర్ అంటాడు. మా చేత ఈ పని చేయించింది ఎంఎస్ఆర్ అంటాడు వాసన్.

ఎంఎస్ఆర్ ఎందుకు ఇలా చేయిస్తాడు అని అనుకుంటాడు రిషి. మా మధ్య కాలేజీ గొడవలు ఉన్నాయి. అందుకే ఇలా చేసి ఉంటాడు అని అనుకుంటాడు రిషి. తన మీద కంప్లయింట్ ఇవ్వండి సార్ అంటే అవసరం లేదు సార్ అంటాడు రిషి. ఇప్పుడు నిజానిజాలు మీకు తెలిశాయా అంటే సారీ సార్ అంటాడు ఎస్ఐ.

ఆ తర్వాత పోలీసులు.. వాసన్, చిత్ర తల్లిదండ్రులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. మరోవైపు రిసార్ట్ లో ఉన్న శైలేంద్ర.. ధరణిపై కోపంగా చూస్తుంటాడు. ఆ తర్వాత కాస్త రొమాంటిక్ గా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది