Guppedantha Manasu 3 Nov Today Episode : శైలేంద్ర మీద ముకుల్‌కు డౌట్ వచ్చేలా ప్రవర్తించిన వసుధార.. జగతిని చంపింది శైలేంద్ర, దేవయాని అనే విషయం ఆఫీసర్‌కు తెలుస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 3 Nov Today Episode : శైలేంద్ర మీద ముకుల్‌కు డౌట్ వచ్చేలా ప్రవర్తించిన వసుధార.. జగతిని చంపింది శైలేంద్ర, దేవయాని అనే విషయం ఆఫీసర్‌కు తెలుస్తుందా?

Guppedantha Manasu 3 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 3 నవంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 911 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన చుట్టు పక్కన ఉన్న వాళ్లను, అవసరం అయితే మన అనుకునే వాళ్లను ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్తే బాగుంటుందేమో అని అంటుంది వసు. దీంతో అవును.. ఏదైనా ఘటన జరిగితే ముందు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ను ఇంటరాగేట్ చేస్తాం. ఆ తర్వాత […]

 Authored By gatla | The Telugu News | Updated on :3 November 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  ముందు ఇంట్లోని వాళ్లనే ఇన్వెస్టిగేట్ చేస్తా అని చెప్పిన ముకుల్

  •  దీంతో భయపడ్డ శైలేంద్ర, దేవయాని

  •  జగతి మేడమ్ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్లావు అని వసును ప్రశ్నించిన ముకుల్

Guppedantha Manasu 3 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 3 నవంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 911 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన చుట్టు పక్కన ఉన్న వాళ్లను, అవసరం అయితే మన అనుకునే వాళ్లను ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్తే బాగుంటుందేమో అని అంటుంది వసు. దీంతో అవును.. ఏదైనా ఘటన జరిగితే ముందు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ను ఇంటరాగేట్ చేస్తాం. ఆ తర్వాత ఇరుగు పొరుగుతో మాట్లాడి.. నిందితులను అదుపులోకి తీసుకుంటాం అంటాడు ముకుల్. దీంతో దేవయాని.. మా ఇంట్లో వాళ్లను ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదు. మేము చాలా అన్యోన్యంగా ఉంటాం అంటుంది దేవయాని. కానీ.. ఈ మధ్య చాలా మంది ఇంట్లో వాళ్లే ఇలాంటి ఘటనలు చేస్తున్నారు అంటుంది వసుధార. దీంతో అంటే ఏమంటావు వసుధార.. మేమే ఈ నేరం చేశామంటావా అంటుంది దేవయాని. దీంతో అయ్యో నేను అలా అనలేదు మేడమ్. జగతి మేడమ్ మరణానికి ఏ కారణం ఉందో.. జరిగే ప్రతి తప్పు వెనుకాల ఒక స్వార్థం ఉంటుంది కదా అంటుంది వసుధార. నిజమేనమ్మా.. ఇదంతా ఎవరో వాళ్ల స్వార్థం కోసం చేస్తున్నారు. కానీ.. ఏం ఆశించి చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటాడు రవీంద్ర. మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అంటే.. మాకు ఎవరి మీదా అనుమానం లేదు సార్. మాకు శత్రువులు కూడా లేరు అంటాడు రవీంద్ర. దీంతో ఎంఎస్ఆర్ ఉన్నాడు కదా సార్ అంటుంది వసుధార.

ఎంఎస్ఆర్ ఎవరు అంటే.. తను మా కాలేజీని సొంతం చేసుకోవడానికి రెండు మూడు సార్లు ప్రయత్నించాడు అంటాడు రిషి. నేనే వార్నింగ్ ఇచ్చాను అంటాడు రిషి. అయితే.. ఇందులో ఆయన హస్తం ఏదైనా ఉందంటారా అని అడుగుతాడు ముకుల్. అతడు ఇలా చేస్తాడని నేను అనుకోను అంటాడు రిషి. ఎవరూ కావాలని చేయరు సార్.. అంటుంది వసు. అవును.. ఆరోజు జగతి మేడమ్ అక్కడ ఉందని మీకు ఎలా తెలిసిందని వసును అడుగుతాడు ముకుల్. దీంతో ఆరోజు ఆయన హడావుడిగా వెళ్లడంతో ఏమైందో అని ఒక స్టూడెంట్ తో కలిసి నేను వెళ్లాను అంటుంది వసు. అప్పటికే రిషి సార్ మీద చాలా అటాక్స్ జరిగాయి అంటుంది వసు. దీంతో ఎప్పటి నుంచి ఇలా రిషి మీద అటాక్స్ జరుగుతున్నాయి అని అడుగుతాడు ముకుల్. దీంతో శైలేంద్ర సార్ ఫారెన్ నుంచి వచ్చినప్పటి నుంచి అంటుంది ధరణి. దీంతో శైలేంద్ర షాక్ అవుతాడు. ఇదంతా ఎలా జరిగింది. మేడమ్ ను ఎవరు ఫాలో అయ్యారు. అనే విషయాలు మొత్తం కనుక్కుంటాను అంటాడు ముకుల్.

Guppedantha Manasu 3 Nov Today Episode : ఆఫీసర్ ముందు భుజాలు తడుముకున్న శైలేంద్ర

దీంతో శైలేంద్ర.. మా ఇంటికి ఎవరూ శత్రువులు లేరు. మీరు అలా అనుకోకండి అంటాడు. దీంతో అలా అంటావు ఏంటి అన్నయ్య.. మన ఫ్యామిలీ మీద అనుమానం కాదు.. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ ఆఫీసర్ ప్రయత్నిస్తున్నాడు అంటాడు రిషి. మా ఇంట్లో, మా మధ్య మీకు శత్రువులు దొరకరు. మాకు ఒకరంటే మరొకరికి చాలా ప్రాణం. నాకు నా తమ్ముడంటే ప్రాణం. జగతి అంటే గౌరవం.. అంటాడు రవీంద్ర.

ఒకవేళ ఈ ఇంట్లో వాళ్లు ఏమైనా చేశారంటే ముందు నేనే ఊరుకోను. కానీ.. మీ ప్రయత్నం మీరు గట్టిగా చేయండి. అది ఎవరైనా సరే పట్టుకొని తీరండి. మీరు మా జగతి స్టూడెంట్ కాబట్టి ఈ కేసులో కొంచెం నిజాయితీగా కేసు సాల్వ్ చేయండి అంటాడు రవీంద్ర.

ఒకసారి సంఘటన స్థలానికి వెళ్దాం అని చెబుతాడు ముకుల్. రిషి వాహనాన్ని ఎవరు వెంబడించారో ట్రాఫిక్ కెమెరాల్లో చెక్ చేస్తాం అంటాడు ముకుల్. దీంతో వీడెవడు.. ఇలా ఉన్నాడు అని అనుకుంటాడు శైలేంద్ర.

మరోవైపు రాత్రి అవుతుంది. రిషి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార వచ్చి ఏం ఆలోచిస్తున్నారు సార్ అంటుంది. దీంతో ఏం లేదు వసుధార. ముకుల్ గురించి నీకు ముందే చెప్పలేదని ఫీల్ అవుతున్నావా అంటే లేదు సార్ అంటుంది వసుధార. మీరు ఏది చేసినా నాకు చెప్పాల్సిన అవసరం లేదు సార్ అంటుంది వసుధార.

మల్లెపూలు అల్లుతూ ఉంటుంది వసుధార. ఈ మల్లెపూలు చూసినప్పుడల్లా నాకు కొన్ని గుర్తొస్తుంటాయి అని అంటాడు రిషి. అవును.. అప్పుడు మీరు నాకు ఎందుకు మల్లెపూలు కొనిచ్చారు అంటుంది వసుధార. దీంతో నువ్వు మల్లెపూలు ఇలా కడుతావని తెలియక అంటాడు రిషి. అప్పుడు కొనిచ్చాను కానీ.. ఇప్పుడు కొనివ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి కడుతున్నావు కదా అంటాడు. ఇద్దరం కలిసి కడదాం అంటాడు రిషి. మీరు పూలు కట్టడం ఎందుకు.. అంటే ఏం కాదు అంటాడు. ఇద్దరూ కలిసి మల్లెపూలు కడతారు. ఆ తర్వాత మల్లెపూల దండను తన మెడలో వేస్తాడు రిషి. ఇద్దరూ కాసేపు అన్యోన్యంగా ఉంటారు.

మరోవైపు తన ప్లాన్స్ అన్నీ బెడిసికొడుతున్నాయని తనను తానే బెల్ట్ తో కొట్టుకుంటూ ఉంటాడు శైలేంద్ర. అసలు నువ్వు ఏం చేస్తున్నవో నీకు అర్థం అవుతోందా అని అక్కడికి వస్తుంది దేవయాని. ఇంతలో ధరణి కాఫీ అంటూ తీసుకొని వస్తుంది. అసలు నువ్వు ఏం మనిషివి. ఇప్పుడు కాఫీ తీసుకొస్తావా? అసలు ఇక్కడ ఏం జరుగుతోందో నీకు తెలుసా అని అడుగుతుంది దేవయాని. దీంతో ఆయన టెన్షన్ ను తట్టుకోలేక బెల్ట్ తో కొట్టుకుంటున్నారు అంటుంది ధరణి. అందుకే కాఫీ తెచ్చా. తాగండి అంటుంది. దీంతో శైలేంద్రకు ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది