Intinti Gruhalakshmi 21 Nov Today Episode : నందు వల్లే తన తల్లి చనిపోయిందని తులసి షాకింగ్ నిర్ణయం… నందుకు దీనికి ఒప్పుకుంటాడా? ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Intinti Gruhalakshmi 21 Nov Today Episode : నందు వల్లే తన తల్లి చనిపోయిందని తులసి షాకింగ్ నిర్ణయం… నందుకు దీనికి ఒప్పుకుంటాడా? ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే?

Intinti Gruhalakshmi 21 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి 21 నవంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ తాజాగా ప్రసారం అయింది. ఈరోజు ఎపిసోడ్ 1107 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా మీద ఇంకా కోపం ఉందా అక్క అంటే లేదురా అంటుంది తులసి. మరి ఇంటికి పోదాం పదా అని అంటాడు దీపక్. అమ్మ లేకుండా ఇల్లు బోసిపోయి ఉంది.. అని దీపక్ అంటే వద్దురా.. నేను అక్కడికి రాలేను. అమ్మ లేని […]

 Authored By gatla | The Telugu News | Updated on :21 November 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  ఇంటికి వెళ్దాం అని దీపక్ అంటే నేను రాను అన్న తులసి

  •  నందుపై ఇంట్లో వాళ్లు అంతా సీరియస్

  •  నందును తులసి అసహ్యించుకుంటుందా? ఇంట్లో నుంచి వెళ్లగొడుతుందా?

Intinti Gruhalakshmi 21 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి 21 నవంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ తాజాగా ప్రసారం అయింది. ఈరోజు ఎపిసోడ్ 1107 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా మీద ఇంకా కోపం ఉందా అక్క అంటే లేదురా అంటుంది తులసి. మరి ఇంటికి పోదాం పదా అని అంటాడు దీపక్. అమ్మ లేకుండా ఇల్లు బోసిపోయి ఉంది.. అని దీపక్ అంటే వద్దురా.. నేను అక్కడికి రాలేను. అమ్మ లేని ఆ ఇంటికి నేను రాలేను అంటుంది తులసి. కనీసం కార్యక్రమాలు పూర్తయ్యే వరకు అయినా ఆ ఇంట్లో నాకు తోడుగా ఉండు అక్క. నేను ఇప్పుడు ఒంటరి వాడిని అయ్యాను అని అంటాడు దీపక్. అయినా కూడా తులసి నేను రాను అంటుంది. అమ్మ చివరి చూపు చూసుకోలేకపోయాను అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. మరోవైపు నందు.. తెలిసో తెలియకో పెద్ద తప్పు చేశాను అని బాధపడతాడు. దివ్య ఒంటరిగా కూర్చొని నందుపై తులసి విరుచుకుపడటం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. పరందామయ్య ఇంతలో వచ్చి నానమ్మ ఏది అంటే గదిలో ఉంది. బయటికి కూడా రావడం లేదు అంటుంది దివ్య. ఇంతలో అక్కడికి నందు వస్తాడు. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకు నన్ను శత్రువులా చూస్తున్నారు. నేను చేసిన తప్పు ఏంటి అంటే నీకు తెలియదా అని అంటాడు పరందామయ్య.

ఒక ప్రేమించి వ్యక్తికి తీరని అన్యాయం చేశారు అంటే అది నేను కావాలని చేసింది కాదు అంటాడు నందు. అనుకోకుండా జరగడం ఏంట్రా. వైజాగ్ వెళ్లినప్పుడు తులసి మొబైల్ నీ దగ్గర ఎందుకు ఉంది అని అడుగుతాడు. దీంతో ఆఫీసు విషయంలో మేనేజర్ కాల్ చేస్తే నాకు ఫోన్ ఇచ్చింది. అందుకే తన ఫోన్ తీసుకున్నాను అంటాడు నందు. మాట్లాడిన తర్వాత తన ఫోన్ తనకు ఇవ్వాలి కదా అంటాడు. దీపక్.. తులసి నెంబర్ కు ఫోన్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడకుండా కాల్ కట్ చేశావు.. అని అడుగుతాడు. దీంతో అప్పుడే నా మనసులో మాట తులసికి చెప్పే సమయంలో ఉన్నాను. అందుకే ఫోన్ కట్ చేశాను అంటాడు. మరి నీకు కాల్ చేశాడు కదా. అప్పుడు అయినా మాట్లాడొచ్చు కదా అంటే.. నేను, తులసి కలిసి ఉండటం దీపక్ కు ఇష్టం లేదు. అలాగే తులసికి నేను నా మనసులో మాట చెప్పాలని అనుకున్నాను. అందుకే నాకు ఆ సమయంలో డిస్టర్బ్ చేస్తున్నట్టుగా అనిపించింది. అందుకే ఫోన్ వెంటనే కట్ చేశాను అంటే.. నువ్వు ఏ కారణంతో అయితే తులసికి ఫోన్ వస్తే మాట్లాడుకుండా చేశావో… ఆ కారణం ఇప్పుడు తులసికి తెలిస్తే నీకు ఈ ఇంట్లో చోటు కూడా ఇవ్వదు అంటాడు పరందామయ్య.

Intinti Gruhalakshmi 21 Nov Today Episode : దివ్యకు ఫోన్ చేసిన రాజ్యలక్ష్మి

అమ్మకు నీ మీద పీకల దాకా కోపం ఉంది. అమ్మ నిన్ను క్షమించడం జరగదు అంటుంది దివ్య. దీంతో మరి ఇంట్లో నా పరిస్థితి ఏంటి అంటే.. అది నువ్వే తేల్చుకోవాలి అంటాడు పరందామయ్య. ఒకసారి అమ్మను పిలువు అంటే.. ఆ విషయంలో నా మాటే.. అమ్మ మాట. తను ఏం చేయలేదు అంటాడు పరందామయ్య. అమ్మ నిన్ను క్షమించేలా చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది నాన్న అంటుంది దివ్య. నువ్వు తులసి కలిసి ఉంటే చూడాలని మేము ఇప్పటికీ కోరుకుంటున్నాం కానీ.. ఆ విషయంలో మేము నీకు ప్రత్యక్షంగా కూడా ఎలాంటి సాయం చేయలేం అంటాడు పరందామయ్య.

ఆ తర్వాత సరస్వతి ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది తులసి. నీతో ఉన్న ఆ మధుర క్షణాలు అన్నీ పోయాయి అమ్మ అంటుంది తులసి. చితిమంటల్లో కలిసి పోయాయి అంటుంది. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయావా అమ్మ. అమ్మ మమ్మల్ని వదిలి వెళ్లడానికి నీకు మనసు ఎలా వచ్చిందమ్మా. ఇప్పుడు మాకు ధైర్యం ఎవరు చెబుతారు. మేము పాపాత్ములం అమ్మ అంటుంది తులసి. నాకు కొంచెం కూడా జాలి పొందడానికి అర్హత లేదు అయ్యో అని అనుకుంటుంది తులసి. ఈలోకంలో నాకంటే దురదృష్టవంతురాలు ఎవ్వరూ లేరమ్మా అంటుంది తులసి. అమ్మ.. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది.

దివ్య దీనంగా కూర్చోవడం చూసి దీపక్ తనతో మాట్లాడుతాడు. మీ అమ్మమ్మ గుర్తొచ్చిందా అని అడుగుతాడు. ఇక ముందు ఈ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నా అంటుంది. అమ్మానాన్న తిరిగి ఒక్కటవుతారని అనుకున్నా. ఎప్పటికో అప్పటికి ఇద్దరూ కలుస్తారని అనుకున్నాం కానీ.. ఇప్పుడు వాళ్లను కలపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు అంటుంది దివ్య.

మరోవైపు రాజ్యలక్ష్మి.. దివ్యకు ఫోన్ చేస్తుంది. అత్త గారు లేకపోయే సరికి నువ్వు, మీ ఆయన బాగా ఎంజాయ్ చేస్తున్నారా అంటుంది. హనీమూన్ కు కూడా వెళ్లారట కదా అంటుంది రాజ్యలక్ష్మి. మాట్లాడవేంటి అని అంటుంది. పక్కనే నీ మొగుడు ఉన్నాడా అంటుంది. ఏం లేదు దివ్య. మీ అమ్మమ్మ గారు పోయారటకదా. పలకరిద్దామని కాల్ చేశాను అంటుంది. ఇంతకీ ఎలా చనిపోయింది అంటే.. సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది అని చెబుతుంది దివ్య.

నువ్వు మన ఆసుపత్రిలో ఫ్రీగా ఆపరేషన్స్ చేయిస్తుంటావు. పాపం మీ అమ్మమ్మ ఆపరేషన్ చేయించుకునే గతి లేక చనిపోయిందట కదా. పాపం అంటుంది రాజ్యలక్ష్మి. ఒకసారి ఫోన్ మీ అమ్మకు ఇస్తావా. ఎంత కాదనుకున్నా వియ్యపురాలు కదా అంటే.. అమ్మ ఇప్పుడు మాట్లాడే మూడ్ లో లేదు అని ఫోట్ కట్ చేస్తుంది దివ్య.

మరోవైపు నందు అన్నం పెట్టుకొని తింటూ ఉంటాడు. అతడిని చూసి పరందామయ్య, దివ్య షాక్ అవుతారు. నాన్న అంటుంది దివ్య. ఎక్కడికి అంటే.. ఏం చెప్పడు. లాస్య.. తులసి ఇంటికి వస్తుంది. మళ్లీ ఇద్దరినీ రెచ్చగొడుతుంది. తులసి సీఈవో అయిన తర్వాత నందు.. తన మీద ఈగ కూడా వాలనీయడం లేదట అంటే.. అత్తయ్య.. నాకు, ఆయనకు సంబంధం లేదు అంటే నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ సీరియస్ అవుతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది