Intinti Gruhalakshmi 27 Nov Today Episode : మద్యం మత్తులో తులసికి తన మనసులో మాట చెప్పేసిన నందు.. బసవయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన దివ్య | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Intinti Gruhalakshmi 27 Nov Today Episode : మద్యం మత్తులో తులసికి తన మనసులో మాట చెప్పేసిన నందు.. బసవయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన దివ్య

Intinti Gruhalakshmi 27 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 27 నవంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1112 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎందుకమ్మా అంత టెన్షన్ పడతావు. ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది కదా అంటే.. తులసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అంటుంది. ఆఫీసు వాళ్లు ఆపకుండా చేస్తూనే ఉన్నారు. లిఫ్ట్ చేస్తే కదా అంటుంది తులసి. దీంతో […]

 Authored By gatla | The Telugu News | Updated on :27 November 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  రోడ్డు మీద తాగి పడిపోయిన నందును ఇంటికి తీసుకెళ్లిన లాస్య

  •  నందును ఆ పరిస్థితిలో చూసి తులసి షాక్

  •  దొంగతనం కోసం తన ఫ్రెండ్ ను ఇంటికి తీసుకొచ్చిన దివ్య

Intinti Gruhalakshmi 27 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 27 నవంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1112 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎందుకమ్మా అంత టెన్షన్ పడతావు. ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది కదా అంటే.. తులసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అంటుంది. ఆఫీసు వాళ్లు ఆపకుండా చేస్తూనే ఉన్నారు. లిఫ్ట్ చేస్తే కదా అంటుంది తులసి. దీంతో వాడే చేస్తాడులే అమ్మ అంటుంది అనసూయ. అలసిపోయినట్టున్నావు కాఫీ తెస్తా ఆగు అంటే.. అత్తయ్య నాకు ఇప్పుడు కావాల్సింది కాఫీ కాదు. మీ అబ్బాయి దగ్గర ఉన్న ఫైల్. ఆఫీసులో అల్మారాకు లాక్ వేసి బయటికి వెళ్లారు. ఇప్పుడు ముఖ్యమైన మీటింగ్ ఉంది అంటుంది తులసి. ఆఫీసు అల్మారాకు లాక్ వేసి ఎక్కడికి వెళ్లాడు అని అంటుంది అనసూయ. దీంతో మళ్లీ ఎవరి జీవితం నాశనం చేయడానికి వెళ్లారో అంటుంది తులసి. దీంతో ఎందుకమ్మా వాడి గురించి అలా మాట్లాడుతున్నావు అంటుంది అనసూయ. మరి ముఖ్యమైన ఫైల్ అందులో పెట్టి ఎక్కడికి వెళ్లారు అంటుంది తులసి.

మరోవైపు బార్ కి వెళ్లి ఫుల్లుగా మందు తాగుతూ కూర్చొంటాడు నందు. ఎందుకు తులసి నన్ను అర్థం చేసుకోవు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తాడు నందు. ఇంతలో రౌడీలు వచ్చి ఎవడ్రా నువ్వు మా టేబుల్ మీద కూర్చున్నావు అని అడుగుతారు నందును. దీంతో ఇదేమైనా నీ బాబుగాడి బారా? అంటూ ఫైర్ అవుతాడు నందు. దీంతో లేవరా అంటూ నందును ఫుల్లుగా తిట్టి అక్కడి నుంచి బయటికి పంపిస్తారు రౌడీలు. దీంతో అక్కడి నుంచి బయటికి వెళ్తాడు నందు. బార్ బయట నిలబడి ఉండటం లాస్య చూస్తుంది. వెంటనే కారు ఆపి తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్తుంది లాస్య. ఏంటి నందు ఇది.. ఎలాంటి వాడివి ఎలా అయ్యావు. నీకు ఈ అవమానాలు ఏంటి. ఇదంతా తులసి వల్లనే కదా. ఏకమైపోయింది నీ పౌరుషం అని అడుగుతుంది లాస్య. పౌరుషం లేదు.. ఏం లేదు అంటాడు నందు.

Intinti Gruhalakshmi 27 Nov Today Episode : లాస్య నందును తీసుకురావడం చూసి తులసి షాక్

ఇప్పటి వరకు వాడు ఇంటికి రాలేదు. పోలీస్ కంప్లయింట్ ఇద్దామా అంటే ఏమని కంప్లయింట్ ఇస్తావు. మా వాడు ఆఫీసు నుంచి ఇంకా ఇంటికి రాలేదు. కాస్త వెతికి పెట్టండి అని ఇద్దామా అంటాడు. ఆ తర్వాత మీరిద్దరూ ఆఫీసులో ఏమైనా గొడవ పడ్డారా అని అడుగుతుంది అనసూయ. ఇంతలో లాస్య కారు ఆపి.. నందును తీసుకొని తులసి ఇంటికి వస్తుంది. తనను పట్టుకొని లోపలికి వస్తుంది. లాస్య నందును తీసుకొని రావడం చూసి షాక్ అవుతారు.

తులసి అయితే ముఖం తిప్పుకుంటుంది. అసలు ఇంతలా తాగి రోడ్డు మీదికి వచ్చాడు. అసలు మీరు ఏమన్నారు అని అంటుంది తులసి. బారులో తాగి ఎవరితోనో గొడప పెట్టుకున్నాడు. వాళ్లు తన్ని రోడ్డు మీద పడేశారు అంటుంది. సమయానికి నేను రాకుండా ఉండి ఉంటే ఏంటి పరిస్థితి అంటుంది లాస్య. ఆ తర్వాత నువ్వు వెళ్లు.. నేను చూసుకుంటా అని చెప్పి అక్కడి నుంచి తులసి దగ్గరికి వెళ్తాడు నందు.

ఏంటి అలా చూస్తున్నావు. నన్ను కొట్టాలని ఉందా? నువ్వు నన్ను ఏం చేసినా నువ్వంటే నాకు ఇష్టం. నా మనసులో మాట చెప్పకపోతే నేను ప్రశాంతంగా ఉండలేను అంటాడు నందు. వద్దురా అని తన తల్లిదండ్రులు వారించినా నందు వినడు. నేను చెప్పేది వినేంత వరకు నా మనసులో ఉన్నది చెప్పేస్తా అంటాడు నందు.

మీ అమ్మగారి విషయంలో తప్పు జరిగింది. అవును నేను చేసింది తప్పే కానీ.. నీతో ఇప్పుడు నేను జీవితం పంచుకోవాలని అనుకుంటున్నా. ఇదే విషయం వైజాగ్ లో రెస్టారెంట్ లో చెబుదామని అనుకున్నా. అదే సమయానికి మీ తమ్ముడు ఫోన్ చేస్తే కట్ చేశా. మళ్లీ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేశా. ఆ తర్వాత నాకు ఫోన్ చేయడంతో నేను తిట్టి పెట్టేశా. కానీ.. ఏం లాభం నా మనసులో మాటను నేను చెప్పలేకపోయా. కానీ.. అత్తయ్య గారి విషయంలో నేను అంత పొరపాటు చేస్తానని అనుకోలేదు అంటాడు నందు.

అయినా కూడా నా మనసులో మాటను చెప్పుకోలేకపోయాను. కావాలని నేను ఏ తప్పు చేయలేదు. నన్ను క్షమించు తులసి అని తన కాళ్ల మీద పడతాడు నందు. కానీ.. తులసి మాత్రం అస్సలు నందును పట్టించుకోదు. అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

కట్ చేస్తే తన ఇంట్లో దొంగతనం చేయాలని తనకు తెలిసిన వ్యక్తిని ఇంటికి పిలిపిస్తుంది దివ్య. బసవయ్య రూమ్ లో డబ్బులు తీయాలని చెబుతుంది. దీంతో అతడు బసవయ్య రూమ్ కు వెళ్తాడు. నా గదిలో చప్పుడు అవుతోంది ఏంటి అంటూ తన గది దగ్గరికి వస్తాడు. ఏంటి నా గదిలో ఏం జరుగుతోంది. ఎవడైనా దొంగోడు దూరాడా అని అనుకుంటాడు. తన గది దగ్గరికి వెళ్లగానే.. అప్పుడే దివ్య, తన తోటి కోడలు వస్తారు.

దొంగ ఏమైనా దూరాడా? చప్పుడు వస్తోంది అని అంటుంది దివ్య. దొంగ దొంగ అని అరుస్తుంటే.. దొంగ కాదు ఎలక అంటాడు బసవయ్య. అందరూ వస్తారు. ఇంతలో దొంగ బయటికి వస్తాడు. అందరూ అతడిని పట్టుకుంటారు. వీడిని నాలుగు పీకితే అసలు ఎందుకు వచ్చాడో తెలుస్తుంది అంటారు అందరూ.

వాడిని వదిలేయండి.. అంటాడు బసవయ్య. మా ఆవిడ కోసం గోల్డ్ చైన్ చేయించి తీసుకెళ్తుంటే నన్ను దొంగలు తరిమారు. దీంతో గోల్డ్ లాకెట్ తీసుకొని మీ ఇంట్లో దూరి ఆ రూమ్ లో దాక్కున్నా అంటాడు. అక్కడ కప్ బోర్డ్ లో దాచాను అంటాడు. అబద్ధాలు చెప్పకు. గోల్డ్ లాకెట్ ఎక్కడ ఉంది చూపించు అంటే.. లోపల ఉంది అని ఆ లాకెట్ లో దాచినట్టు చూపిస్తాడు.

దీంతో ఆ కబ్ బోర్డ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఫుల్లుగా డబ్బులు ఉంటాయి. వాటిని చూసి షాక్ అవుతాడు విక్రమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక