Guppedantha Manasu 29 Nov Today Episode : రిషికి షాకిచ్చిన అనుపమ.. నీ తల్లిని చంపిన వాళ్లను మాత్రం పట్టుకోవా అని ప్రశ్నించిన అనుపమ.. దీంతో రిషి ఏం చేస్తాడు?
ప్రధానాంశాలు:
రిషికి థాంక్స్ చెప్పిన వసు
అనుపమకు కాల్ చేసి ఇంటికి రమ్మన్న మహీంద్రా
రిషిని ప్రశ్నించిన అనుపమ
Guppedantha Manasu 29 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 29 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 933 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషిని పట్టుకొని ఏడుస్తుంది వసుధార. నా వల్ల చిత్ర సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని ఫిర్యాదు చేయడంతో నేను చాలా బాధపడ్డాను. ఒక్క క్షణం నా ఊపిరి ఆగిపోయినంత పని అయింది సార్. ప్రెస్ వాళ్లు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉన్నా కూడా వాళ్లు నన్ను నమ్మడం లేదు. పక్కాగా ఆధారాలు క్రియేట్ చేసుకొని నన్ను ఇరికించారని అర్థమైంది అంటుంది వసుధార. హాస్పిటల్ లో అనుపమ మేడమ్ అడిగిన ప్రశ్నలకు నా తల కొట్టేసినట్టు అయింది సార్. చాలా భయపడిపోయాను సార్ అంటుంది వసుధార. నువ్వు భయపడకు వసుదార. నీ వెంట నేను వస్తాను అని మీరు అన్నారు. అప్పుడే నాకు కొండంత ధైర్యం వచ్చింది సార్. థాంక్యూ సార్. థాంక్యూ వెరీ మచ్ అంటుంది వసుధార. మనం ఒకరకంగా థాంక్స్ చెప్పాల్సింది అనుపమ గారికి అంటాడు రిషి. నీకెందుకు భయం వసుధార. నేను నీ పక్కన ఉండగా ఎవ్వరూ నిన్ను వేలెత్తి చూపించలేరు. నిన్ను ఎవరు టచ్ చేయాలన్నా ముందు నన్ను దాటి నీ వరకు రావాలి. అది గుర్తు పెట్టుకో అంటాడు రిషి. సరేనా.. ఈ రిషి నీ భర్త మాత్రమే కాదు.. నీ ప్రాణాలకు, నీ భవిష్యత్తుకు భరోసా అంటాడు రిషి.
మరోవైపు అనుపమకు మహీంద్రా ఫోన్ చేస్తాడు. నువ్వు ఒకసారి ఇంటికి రావాలి అంటాడు. ఇంటికా ఎందుకు అంటే.. వస్తే చెప్తా రా అంటాడు. ఇప్పుడా అంటే.. ఇప్పుడే అంటాడు. మహీంద్రా ఇంటికి ఎందుకు రమ్మంటున్నాడు. సరే ఇంటికి వెళ్తే తెలుస్తుంది కదా అని అనుకుంటుంది. మరోవైపు ఎంఎస్ఆర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు రిషి. వసుధార కూడా ఎంఎస్ఆర్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వాసు చెప్పింది నిజమే అంటారా? ఎంఎస్ఆర్ కు ఇన్ని తెలివితేటలు ఉండవు కదా. ఆయన వెనుక ఇంకెవరో ఉన్నారని అనిపిస్తోంది సార్ అంటుంది వసుధార. వాసవ్ చెప్పినట్టు దీనికంతటికి కారణం ఎంఎస్సారా.. లేదా వేరే వాళ్ల.. ఎవరైనా సరే వాళ్లను వదిలిపెట్టే సమస్యే లేదు అంటాడు రిషి. మరోవైపు ఒక చోట కారు ఆపి చాయ్ తాగుతారు. రిషి కోసం సపరేట్ గా తయారు చేస్తుంది వసుధార.
Guppedantha Manasu 29 Nov Today Episode : రిషి, వసుధారతో సెల్ఫీ తీసుకున్న టీ కొట్టు వ్యక్తి
టీ తయారు చేసే వ్యక్తి మీరు రిషి సార్ కదా. మీరు చాలా గొప్పవారు. చాలా ఫేమస్. మీరంటే మా పిల్లలకు చాలా ఇష్టం సార్ అంటాడు. మీతో సెల్ఫీ తీసుకొని మా పిల్లలకు చూపిస్తే వాళ్లు చాలా సంతోషిస్తారు సార్ అంటాడు. అంతేనా లేక రిషి సార్ మా టీ షాపునకు వచ్చారని బ్యానర్ కడతారా అంటే.. అరె ఈ ఐడియా ఏదో బాగుంది అంటాడు. కానీ.. అలా వద్దు. మీ చాయ్ నచ్చి రావాలి కానీ.. ఇలా ఏదో బ్యానర్ కట్టి గిరాకీ పెంచుకోవడం కరెక్ట్ కాదు అంటాడు రిషి. ఆ తర్వాత ఇద్దరితో సెల్ఫీ తీసుకుంటాడు టీ వ్యక్తి.
మరోవైపు అనుపమ మహీంద్రా ఇంటికి వస్తుంది. ఇంతలో రిషి, వసుధార వస్తారు. వసుధార మీద పడ్డ నింద తొలిగిపోయింది అంటాడు. తను ఏ తప్పు చేయలేదని తేలిపోయింది మేడమ్. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు. హ్యాపీగా ఉన్నావా అంటుంది అనుపమ. సరే.. నీ భార్య మీద వచ్చిన నిందను తొందరగానే తుడిచేశావు. నీ భార్య నేరస్థురాలు కాదని నిజాయితీగా నిరూపించావు. నేరస్తులను పట్టుకోవడంలో నీకు ఎంతో వేగం, చాతుర్యం ఉంది కదా. కానీ.. మీ అమ్మను చంపిన వాళ్లను పట్టుకోవడానికి నీకు ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది అని ప్రశ్నిస్తుంది అనుపమ.
దీంతో రిషి ఏం మాట్లాడడు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అంటాడు రిషి. భార్య విషయంలో అంత ఫాస్ట్ గా ఉన్న రిషి.. అమ్మ విషయంలో ఎందుకు అంత చురుగ్గా లేడు. నీ కోడలు బయటికి వచ్చేసింది. నీ కోడలు ఏ తప్పు చేయలేదని ఇంటికి పిలిపించి గర్వంగా చెబుతున్నావు. మరి నీ భార్యను చంపిన వాళ్లను ఎందుకు పట్టుకోలేకపోయావు. ఆ నేరస్తుడిని పట్టుకుంటే అది ఇంకా గర్వంగా చెప్పుకోవచ్చు కదా. కనీసం తన చావుకు అయినా న్యాయం చేయాలి మహీంద్రా. ఎందుకు రిషి తేలిగ్గా తీసుకున్నావు అంటే.. నేను తేలికగా తీసుకోలేదు అంటాడు రిషి.
కనీసం నువ్వైనా చొరవ తీసుకొని జగతిని చంపిన వాళ్లను పట్టుకోవచ్చు కదా వసుధార. నిన్న కాలేజీలో జాయిన్ చేయించుకుంది. తన కొడుకును ఇచ్చి పెళ్లి చేసింది. నువ్వు ఈ స్థాయిలో ఉండటానికి కారణం జగతే. మరి నువ్వు జగతి కోసం ఆమాత్రం చేయలేవా అంటుంది. నా జగతిని చంపింది ఎవరో నాకు తెలియాలి అంటుంది అనుపమ.
నేను బయటికి మామూలుగా కనిపిస్తున్నాను కానీ.. లోలోపల కుంగి పోతున్నాను. ఒక స్నేహితురాలిగా మీకే అంత ప్రేమ ఉంటే జన్మనిచ్చిన తల్లి మీద నాకెంత బాధ్యత ఉండాలి అంటాడు. నా ప్రయత్నాలు ఫలమిస్తాయి. అది రేపు కావచ్చు.. ఇంకో రోజు కావచ్చు కానీ.. నా తల్లికి న్యాయం జరుగుతుంది. రాబోయే రోజుల్లో వాటి ఫలితం మీకే తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.