Intinti Gruhalakshmi 30 Oct Monday Episode Highlights : దివ్యను చంపేయ్ అని లాస్యకు చెప్పిన రాజ్యలక్ష్మి.. హనీని అప్పగించాక దివ్యను చంపేయబోతున్న లాస్య | The Telugu News

Intinti Gruhalakshmi 30 Oct Monday Episode Highlights : దివ్యను చంపేయ్ అని లాస్యకు చెప్పిన రాజ్యలక్ష్మి.. హనీని అప్పగించాక దివ్యను చంపేయబోతున్న లాస్య

Intinti Gruhalakshmi 30 Oct Monday Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 30 అక్టోబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1088 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్యను కిడ్నాప్ చేశారని చెప్పి లెటర్ తీసుకొని తులసి దగ్గరికి వెళ్తాడు విక్రమ్. ఆ లెటర్ చూసి తులసి షాక్ అవుతుంది. ఈ పని చేసింది ఖచ్చతంగా లాస్యే అనుకుంటుంది […]

 Authored By gatla | The Telugu News | Updated on :29 October 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  హనీని తులసి లాస్యకు అప్పగించేస్తుందా?

  •  దివ్యను లాస్య చంపేస్తుందా?

  •  విక్రమ్ కి అసలు విషయం తెలుస్తుందా?

Intinti Gruhalakshmi 30 Oct Monday Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 30 అక్టోబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1088 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్యను కిడ్నాప్ చేశారని చెప్పి లెటర్ తీసుకొని తులసి దగ్గరికి వెళ్తాడు విక్రమ్. ఆ లెటర్ చూసి తులసి షాక్ అవుతుంది. ఈ పని చేసింది ఖచ్చతంగా లాస్యే అనుకుంటుంది తులసి. దివ్యకు ఏమైనా కూడా తులసి పట్టించుకోదు. ఎవరికి ఏమైనా మాకు అనవసరం. ఎవరు ప్రమాదంలో ఉన్నా మేము పట్టించుకోం. మాకు హనీ కంటే ఎవ్వరూ ముఖ్యం కాదు అని నందు అంటాడు. తులసి హనీ విషయంలో ఇదే చేస్తుంది. ఈ ఇంట్లో మనుషుల మెండితనాలు అలాగే ఉంటాయి అంటాడు నందు. హనీని ఇచ్చేసి దివ్యను తెచ్చేసుకుందాం అంటాడు నందు. కానీ.. తులసి వద్దు అంటుంది. బెదిరిస్తే బెదిరిపోయి వాళ్లు అడిగింది చేయడం కాదు పరిష్కారం అంటుంది తులసి. పోలీస్ ఫిర్యాదు ఇస్తా అంటుంది తులసి. దీంతో వద్దు అత్తయ్య పోలీస్ కంప్లయింట్ ఇస్తే వాళ్లు ఇంకా రెచ్చిపోతారు అంటాడు విక్రమ్.

ఎంత చెప్పినా తులసి వినదు. నేను చూసుకుంటా అని చెప్పి విక్రమ్ ను తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులను తీసుకొని నేరుగా రత్నప్రభ, లాస్య ఇంటికి వెళ్తుంది. రత్నప్రభ, లాస్య ఇంటికి పోలీసులను తీసుకెళ్లి షాకిస్తుంది. దివ్యను కిడ్నాప్ చేశారని పోలీసులకు చెబుతుంది. వాళ్లను అరెస్ట్ చేయాలని అంటుంది. దీంతో మీదగ్గర సాక్ష్యం ఉందా అని అడుగుతుంది లాస్య. దీంతో ఆ లెటర్ ను చూపిస్తుంది తులసి. కానీ.. అందులో ఏం ఉండదు. ఎందుకంటే.. అది మ్యాజిక్ పెన్ తో రాసిన రాత కావడంతో అది మొత్తం చెరిగిపోతుంది. తెల్లకాగితమే ఉండటంతో, లాస్యే దివ్యను కిడ్నాప్ చేసిందని తెలియకపోవడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయకుండా వెనుదిరుగుతారు. నేను దివ్యను కిడ్నాప్ చేశానని నువ్వు ఎలా రుజువు చేయలేవు. నీకు అసలు సాక్ష్యం చూపిస్తా చూడు.. అంటూ దివ్యను కట్టేసి ఉంచిన వీడియోను చూపిస్తుంది. ఆ తర్వాత తన చేతి మణికట్టను కట్ చేశానని.. రక్తం కారిపోతుందని..  ఇంకొన్ని గంటల్లో దివ్య చనిపోతుందని చెబుతుంది లాస్య. వెంటనే వెళ్లి హనీని తీసుకొచ్చి అప్పగించి దివ్యను తీసుకెళ్లు అంటుంది లాస్య.

Intinti Gruhalakshmi 30 Oct Monday Episode Highlights : హనీ మీద సర్వ హక్కులు మావే అన్న రత్నప్రభ

దీంతో ఏం చేయాలో అర్థం కాదు. దివ్యను ఎలా కాపాడుకోవాలో తులసికి అర్థం కాదు. వెంటనే దివ్యను వదిలిపెట్టు. ప్రాణాలతో ఆడుకోవడం పద్ధతి కాదు అన్నా వినదు. కానీ.. హనీ కోసం తప్పడం లేదు అంటుంది. హనీ నా దగ్గర క్షేమంగా ఉంది అన్నా కూడా వినదు లాస్య.

హనీ మీద సర్వ హక్కులు మావి. ప్రశ్నించే అధికారం మీకు లేదు అంటుంది రత్నప్రభ. వెళ్లండి.. వెంటనే టైమ్ వేస్ట్ చేయకుండా వెళ్లి హనీని తీసుకురండి అని చెబుతుంది తులసి. నేను కూడా మీతోనే వస్తాను.. అంటాడు విక్రమ్. దీంతో ప్రమాదం ఏం లేదు.. మీరు వెళ్లండి నేను చూసుకుంటాను అంటుంది తులసి.

మరోవైపు లాస్యకు రాజ్యలక్ష్మి ఫోన్ చేస్తుంది. ఆ దివ్యను వదిలేయకు. చంపేసేయ్ అంటంది. దీంతో రత్నప్రభ షాక్ అవుతుంది. చంపేయడం ఏంటి.. అసలు రాజ్యలక్ష్మితో ఎందుకు డీల్ సెట్ చేసుకున్నవు. చంపేస్తే మనకు వాళ్లు హనీని అప్పగిస్తారా? అంటుంది రత్నప్రభ.

అయినా ఇవన్నీ వద్దు.. అంటుంది రత్నప్రభ. మీ అవసరంతో పాటు నా పర్సనల్ పగ కూడా తీర్చుకోవడానికి వచ్చాను అంటుంది లాస్య. దీంతో అదే వద్దు అంటుంది రత్నప్రభ. కానీ.. లాస్య వినదు. మరోవైపు విక్రమ్ ఇంటికి వస్తాడు. దివ్య గురించి జాను అడుగుతుంది. తన నాన్న అడుగుతాడు. దీంతో దివ్య ప్రమాదంలోనే ఉంది. ఇంకా కిడ్నాపర్ల దగ్గరే ఉంది అంటాడు విక్రమ్.

మరోవైపు హనీని అప్పగిస్తే కానీ.. దివ్యను వదిలేయం అంటున్నారు అని ఇంటికి వచ్చి చెబుతుంది తులసి. దీంతో ఇప్పటికీ హనీని అప్పజెప్పే ఉద్దేశం లేదా అంటే లేదు అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...