Karthika Deepam 2 : సినిమా లెవల్ లో కార్తీకదీపం 2 సాంగ్…పాటలోనే సీరియల్ స్టోరీ మొత్తం రిలీజ్ చేశారుగా..!!
Karthika Deepam 2 : బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సీరియల్ కార్తీకదీపం. ఇక ఈ సీరియల్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సీరియల్ రెండో భాగం కార్తీకదీపం ఇది నవవసంతం అనే పేరుతో రాబోతుంది. అయితే కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబు మరియు వంటలక్క ఎన్నో ఏళ్లుగా టీవీ ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సీరియల్ […]
Karthika Deepam 2 : బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సీరియల్ కార్తీకదీపం. ఇక ఈ సీరియల్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సీరియల్ రెండో భాగం కార్తీకదీపం ఇది నవవసంతం అనే పేరుతో రాబోతుంది. అయితే కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబు మరియు వంటలక్క ఎన్నో ఏళ్లుగా టీవీ ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సీరియల్ విపరీతంగా పాపులర్ అయింది. దీంతో ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ సీక్వెల్ మరోసారి బుల్లితెరపై వచ్చేందుకు సిద్ధమైంది. ఇక ఈ సీరియల్ ( 25-03-2024 ) సోమవారం నుంచి రాత్రి 8 గంటలకు ప్రచారం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీరియల్ పై మంచి హైప్ ను క్రియేట్ చేసేందుకు మేకర్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమో లు మేకర్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు.
మరోవైపు కార్తీకదీపం సీరియల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. అయితే ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఒక సీరియల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడంం జరిగింది. ఇక గత సీరియల్ కంటే కూడా చాలా గొప్పగా కనిపించేలా కార్తీకదీపం రెండో భాగం ఉంటుందని మూవీ మేకర్స్ ప్రేక్షకులకు హింట్ ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్ , దీప అలియాస్ ప్రేమి విశ్వనాధ్ ను పరిచయం చేస్తున్నారు. అయితే ఈసారి వచ్చే ఈ సీరియల్ మాత్రం మరింత కొత్తగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల ఈ సీరియల్ కు సంబంధించి సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. ఇక ఈ పాట అయితే అచ్చం సినిమాను తలపిస్తుంది అని చెప్పాలి. అయితే గతంలో కార్తీకదీపం సాంగ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. దీంతో ఆ పాట డిజే వర్షన్ కూడా రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.
ఇక ఇప్పుడు కార్తీకదీపం రెండో భాగానికి సంబంధించిన పాట కూడా అదే విధంగా అనిపిస్తుంది. ఇక ఈ పాటలో కాస్త స్టోరీని కూడా రివీల్ చేసినట్లుగా అర్థమవుతుంది. అయితే ఈ కార్తీకదీపం 2 నవవసంతం పేరుతో తమిళ్ సీరియల్ చెల్లెమ్మను మేకర్స్ రీమేక్ చేస్తూ తీసుకువస్తున్నట్లుగా తెలియజేశారు. అయితే కార్తీకదీపం సీరియల్ కు దర్శకత్వం వహించిన కాపుగంటి రాజేంద్ర కార్తీకదీపం 2 ను కూడా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సీరియల్ లో కార్తీక్ మరియు దీప పాత్రలు తప్ప మిగిలిన వారంతా కూడా కొత్తగా కనిపించనున్నారు. అదేవిధంగా మౌనిత పాత్రలో కొత్త అమ్మాయి కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పాటలో ఆమె సైతం కార్తీక్ ను ప్రేమిస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఈ సీరియల్ నుంచి విడుదలైన పాటలు దీపా పాత్రలో ప్రేమ విశ్వనాధ్ కార్తీక్ గా నిరూపమ్ పరిటాల నటిస్తున్నారు. చిన్నారి శౌర్యగా చరిత్ర లక్ష్మీ నటిస్తుండగా మోహిత పాత్రలో కొత్త అమ్మాయి కనిపించింది. మరి ఈ సీరియల్ నుంచి విడుదలైన పాటను మీరు చూశారా. అయితే వెంటనే చూసేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.