3 February Karthika Deepam Today Episode : కార్తీకదీపం 2 ఫిబ్రవరి 3 ఎపిసోడ్: సుమిత్రను బతికించాలంటే దీప కడుపులోని బిడ్డ చనిపోవాలా? కార్తీక్, దీపలకు అగ్నిపరీక్ష!

 Authored By jagadesh | The Telugu News | Updated on :3 February 2026,8:30 am

3 February Karthika Deepam Today Episode : స్టార్ మా (Star Maa) చానెల్‌లో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ ‘కార్తీక దీపం 2’ (Karthika Deepam 2) రోజురోజుకీ ఉత్కంఠభరితంగా మారుతోంది. నేటి ఎపిసోడ్ (ఫిబ్రవరి 3, 2026, మంగళవారం) హైలైట్స్ తెలుసుకుందాం రండి.

3 February Karthika Deepam Today Episode : కార్తీకదీపం 2 ఫిబ్రవరి 3 ఎపిసోడ్: సుమిత్రను బతికించాలంటే దీప కడుపులోని బిడ్డ చనిపోవాలా? కార్తీక్, దీపలకు అగ్నిపరీక్ష!

3 February Karthika Deepam Today Episode : కార్తీకదీపం 2 ఫిబ్రవరి 3 ఎపిసోడ్: సుమిత్రను బతికించాలంటే దీప కడుపులోని బిడ్డ చనిపోవాలా? కార్తీక్, దీపలకు అగ్నిపరీక్ష!

3 February Karthika Deepam Today Episode : జ్యోత్స్నకి మళ్లీ పరీక్ష.. తప్పించుకోలేక ఇబ్బందులు

దశరథకి జ్యోత్స్నపై అనుమానం బలపడింది. ఎలాగైనా నిజం తెలుసుకోవాలని ఆమెను తీసుకుని మళ్లీ ఆసుపత్రికి వెళ్తాడు. శివనారాయణ కూడా వారితో పాటు వెళ్తారు. ఈసారి శాంపిల్స్ మార్చడానికి వీలు లేకుండా శివనారాయణ దగ్గరుండి మరీ జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ ఇప్పిస్తాడు. దీంతో జ్యోత్స్న (Jyotsna) అడ్డంగా దొరికిపోయే పరిస్థితి వచ్చింది. మరోవైపు ఆసుపత్రిలో కార్తీక్, దీపలను చూసిన జ్యోత్స్న.. “మీరు గైనకాలజిస్ట్ దగ్గర ఉండాలి కదా, ఈ డాక్టర్ దగ్గర ఏం చేస్తున్నారు?” అని నిలదీస్తుంది. కార్తీక్ ఏదో ఒక అబద్ధం చెప్పి అక్కడ నుంచి తప్పించుకుంటాడు.

3 February Karthika Deepam Today Episode : దీపే అసలైన వారసురాలు.. కానీ ఓ చేదు నిజం

డాక్టర్ హారిక.. దీప, కార్తీక్‌లకు షాకింగ్ న్యూస్ చెబుతుంది. సుమిత్రకు కావాల్సిన బోన్ మ్యారో దాత (Donor) ఎవరో కాదు ‘దీప’ (Deepa) అని నిర్ధారిస్తుంది. దీప శాంపిల్స్ సుమిత్రతో మ్యాచ్ అయ్యాయని, దీపే సుమిత్ర అసలైన కూతురని డాక్టర్ పరోక్షంగా చెప్పేసింది. ఈ నిజం తెలిసి దీప, కార్తీక్ సంతోషిస్తారు.

కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. సుమిత్ర ప్రాణాలు కాపాడాలంటే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి. అయితే, ప్రస్తుతం దీప గర్భవతి. “సుమిత్ర గారిని బతికించాలంటే.. దీప కడుపులోని బిడ్డను వదులుకోవాల్సి వస్తుంది” అని డాక్టర్ బాంబ్ పేలుస్తుంది. కన్నతల్లిని బతికించుకోవాలా? లేక కడుపులోని బిడ్డను కాపాడుకోవాలా? అనే ధర్మసంకటంలో దీప, కార్తీక్ పడ్డారు. ఈ విషయం తలచుకుని ఇద్దరూ కన్నీరుమున్నీరవుతారు.

కాశీకి విడాకులు ఇస్తా.. స్వప్న సంచలన నిర్ణయం

మరోవైపు శ్రీధర్ ఇంట్లో గొడవ తారాస్థాయికి చేరింది. కాంచన.. తన కొడుకు కాశీని తీసుకుని స్వప్న (Swapna) దగ్గరకు వస్తుంది. కాశీని చూడగానే స్వప్న మండిపడుతుంది. “మోసగాడితో నేను కాపురం చేయలేను.. నాకు కాశీతో విడాకులు (Divorce) కావాలి” అని తేల్చి చెప్పేస్తుంది. కాంచన ఎంత నచ్చజెప్పినా స్వప్న వినదు. దీంతో కాశీ, కాంచన నిరాశగా వెనుదిరుగుతారు.

దశరథ మాటతో కుమిలిపోయిన దీప హాస్పిటల్ బయట డల్లుగా ఉన్న కార్తీక్, దీపలను చూసిన దశరథ.. వారిని ఓదారుస్తాడు. “దీప కడుపులో ఉన్న బిడ్డకు ఏం కాకుండా నేను చూసుకుంటాను.. ఎంత ఖర్చైనా పర్లేదు ఆ బిడ్డ క్షేమంగా పుట్టాలి” అని దశరథ అంటాడు. తను ప్రాణంగా చూసుకునే భార్య బతకాలంటే.. ఆ బిడ్డ చనిపోవాలనే నిజం తెలియక దశరథ అలా మాట్లాడుతుంటే.. కార్తీక్, దీపలు తట్టుకోలేకపోతారు.

రేపటి ఎపిసోడ్‌లో జ్యోత్స్న రిపోర్ట్స్‌లో ఏం రాబోతున్నాయి? బిడ్డ కోసం తల్లిని దీప వదులుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి