Karthika Deepam 2 Today Episode April 14th : కార్తీక్‍కు వార్నింగ్ ఇచ్చిన శివన్నారాయణ.. షాక్‌లో కాంచన, అనసూయ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 2 Today Episode April 14th : కార్తీక్‍కు వార్నింగ్ ఇచ్చిన శివన్నారాయణ.. షాక్‌లో కాంచన, అనసూయ

 Authored By prabhas | The Telugu News | Updated on :14 April 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Karthika Deepam 2 : కార్తీక్‍కు వార్నింగ్ ఇచ్చిన శివన్నారాయణ.. షాక్‌లో కాంచన, అనసూయ

Karthika Deepam 2 Today Episode April 14th : కార్తీక దీపం – 2 నేటి (ఏప్రిల్ 14) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో చూద్దాం. బుల్లెట్ గాయమైన దశరథ్‍కు ఆపరేషన్ చేస్తుంటారు. శివన్నారాయణ, సుమిత్ర, జ్యోత్స్న, పారిజాతం ఏడుస్తూ ఉంటారు. నర్స్ బయటికి రావటంతో మా వాడికి ఎలా ఉందమ్మా అని శివన్నారాయణ అడుగుతాడు. “ఆపరేషన్ జరుగుతోంది. ప‌రిస్థ‌తి చాలా విష‌మంగా ఉంది” అని నర్స్ అంటుంది. దీంతో శివన్నారాయణ, సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుంటారు. డాడీకి ఏమవదు మమ్మీ అని సుమిత్రను ఓదారుస్తుంది జ్యోత్స్న.మామయ్య దశరథ్‍కు ఎలా ఉందో తెలుసుకునేందుకు ద‌వాఖాన‌కు వస్తాడు కార్తీక్. మావయ్యకు ఎలా ఉందని తాత శివన్నారాయణను అడుగుతాడు. దాంతో ముందు నువ్వు బయటికి వెళ్లు అంటూ శివన్నారాయణ ఫైర్ అవుతాడు. పోరా బయటికి అంటూ తోసేస్తాడు. కొట్టినా పర్లేదు మామయ్యకు ఎలా ఉందో చెప్పండంటూ కార్తీక్ మ‌ళ్లీ అడుగుతాడు. నువ్వు ఇలా వినవు అంటూ శివన్నారాయణ కోప్పడుతుంటే.. ఆగండి అని సుమిత్ర అంటుంది.

Karthika Deepam 2 Today Episode April 14th కార్తీక్‍కు వార్నింగ్ ఇచ్చిన శివన్నారాయణ షాక్‌లో కాంచన అనసూయ

Karthika Deepam 2 Today Episode April 14th : కార్తీక్‍కు వార్నింగ్ ఇచ్చిన శివన్నారాయణ.. షాక్‌లో కాంచన, అనసూయ

Karthika Deepam 2 Today Episode April 14th దీపకు కోసమేనా ఇదంతా?

మామయ్యకు ఎలా ఉంది అత్తా అని సుమిత్రను అడుగుతాడు కార్తీక్. మా ఆయనకు ఏమైనా జరిగితే దీపకు అన్యాయం జరుగుతుందని భయపడుతున్నావా అంటూ కన్నీళ్లతో అంటుంది సుమిత్ర. దీప ఎలాంటిదో నీకు బాగా తెలుసని కార్తీక్ చెబుతాడు. సుమిత్ర మాత్రం బాధలో చాలా మాటలు అంటుంది. నాకు అన్యాయం చేసింది దీప కాదు నువ్వే. నా భర్త చావు బతుకుల మధ్య ఉండడానికి కారణం దీప కాదు నువ్వే అంటుంది సుమిత్ర. దానికి డాడీని షూట్ చేసింది దీప అయితే.. బావ ఏం చేశాడని జ్యోత్స్న అంటుంది. అంతా చేసింది మీ బావేనని సుమిత్ర అరుస్తుంది సుమిత్ర‌. ఈరోజు కుటుంబం ఇలా బాధపడేందుకు కారణం మీ బావే అని జ్యోత్స్నతో అంటుంది. నేనా అని కార్తీక్ అడిగితే.. అవును రా నువ్వే అని అంటుంది. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే భయంతో గుండె ఆగిపోయేలా ఉందని సుమిత్ర ఏడుస్తుంది.

నేనేం చేశా అత్త అని కార్తీక్ అడుగుతాడు. దీప మెడలో తాళి కట్టావ్ రా అని సుమిత్ర అంటుంది. దీపను పెళ్లి చేసుకోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని నిందిస్తుంది. దీప మెడలో తాళి కట్టకపోయి ఉండే మా జీవితాల్లో ఆమె ఉండేది కాదని చెబుతుంది. దీప మెడలో తాళి కట్టి రెండు కుటుంబాలను ఎప్పుడూ కలవని శత్రువులను చేశావని సుమిత్ర అంటుంది. ఆ మాటకు కార్తీక్ తల్లిడిల్లిపోతాడు. జ్యోత్స్నను పెళ్లి చేసుకొని ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవని అంటుంది.

దీప మీ ఇంటికి రావడం నాకు తెలియదని కార్తీక్ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. తెలియదు రా.. నీకు ఏం తెలియదు అంటూ శివన్నారాయణ అందుకుంటాడు. నిశ్చితార్థం ఆపినప్పుడు, గౌతమ్ కడుపు చేశాడని ఎవరో అమ్మాయిని తీసుకుని రావడం ఇవన్నీ పట్టించుకున్నావా అని ప్ర‌శ్నిస్తాడు. నిజంగానే తెలియదు తాతా అని కార్తీక్ అంటాడు. దీప స్వయంగా నీ మేనమామనే కాల్చింది రా అని బాధపడతాడు శివన్నారాయణ. ఆ బుల్లెట్ దశరథ్‍కు తలగలకపోయి ఉంటే జ్యోత్స్నకు తగిలేదని శివన్నారాయణ అంటాడు. అంటే దీప ఉద్దేశం నా మనవరాలిని చంపాలనే కాదా అని అంటాడు. ఇవన్నీ నీ భార్య చేస్తుంటే చేతకాని వాడిలా ఉన్నావా అని శివన్నారాయణ అంటాడు.

అవును చేతకాని వాడినే..

అవును నేను చేతకాని వాడినే తాత అని కార్తీక్ అరుస్తాడు. బంధాల కోసం మనుషులను కాపాడుకోవడంలో నా చేతకానితనం ఉందని చెబుతాడు. కత్తుల్లాంటి మాటలతో చీలుస్తారని తెలిసినా ఇప్పుడు కూడా మామయ్య కోసమే వచ్చానని కన్నీళ్లతో అంటాడు కార్తీక్. నువ్వు వచ్చింది నీ మేనమామకు ఏమైనా అయితే దీపకు ఏమవుతుందా అనే వచ్చావని పారిజాతం వెటకారంగా అంటుంది.

ఇప్పుడైనా దీపను వదిలిపెడతానని అనుకుంటున్నావా అని శివన్నారాయణ అంటాడు. రేయ్ కార్తీక్.. దశరథ్ నా ఒక్కగానొక్క కొడుకు మాత్రమే కాదు. నా యావదాస్తికి, నా పరపతికి, నా పరువుకు, నా పంచప్రాణాలకు వాడే వారసుడు. వాడికి ఏమీ కాకపోతే నీ భార్య కనీసం జైలులో అయినా ఉంటుంది. ఏదైనా అయిందో ప్రాణానికి ప్రాణం లెక్కగట్టాల్సిందే” అని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. ఇక పోరా అని శివన్నారాయణ అరుస్తాడు. దీంతో బాధగా అక్కడి నుంచి వెళ్తాడు కార్తీక్.

శౌర్యపై చిరాకుపడిన కార్తీక్

అమ్మానాన్న ఇంకా రావడం లేదు అని కాంచనతో అంటుంది శౌర్య. ఇంతలో కార్తీక్ వస్తాడు. నానమ్మ కిందపడి పోయిందని కార్తీక్‍తో శౌర్య అంటుంది. ఏమైందని కార్తీక్ అంటే.. లోబీపీ వచ్చినట్టుందని కాంచన చెబుతుంది. ఇంతకీ దీప ఏదిరా అని అడుగుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలని ఆలోచనలో పడతాడు కార్తీక్. పని మీద వేరే ఊరికి వెళ్లేందుకు బస్ స్టేషన్‍కు వెళ్లిందని అబద్దం చెబుతాడు కార్తీక్. నాతో చెప్పకుండా ఎలా వెళ్తుతుంద‌ని శౌర్య ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. హోం వర్క్ చేసుకోకుండా ఇన్ని ప్రశ్నలు అవసరమా.. లోపలికి వెళ్లి చదువుకో అంటూ చిరాకుగా అరుస్తాడు కార్తీక్. దాంతో శౌర్య లోపలికి వెళ్తుంది.

మిమ్మల్ని ఇలా చూస్తుంటే భయంగా ఉంది కార్తీక్ బాబు.. దీపకు ఏమైందో చెప్పాలని అనసూయ అడుగుతుంది. అమ్మా ఇది నువ్వు విని తట్టుకోలేవని నాకు తెలుసు, కానీ చెప్పాలి అని కాంచనతో కార్తీక్ చెబుతాడు. “ఏం జరిగిందో అర్థం కావడం లేదు. జ్యోత్స్నకు దీపకు గొడవైంది. జ్యోత్స్న తాత రివాల్వర్ తెచ్చింది. మాటలతో దీపను రెచ్చగొట్టింది. దీప ఆ కోపంతో రివాల్వర్ తీసుకుందట. గన్ ఫైర్ అయింది. బుల్లెట్ మామయ్యకు తగిలింది” అని కార్తీక్ చెబుతాడు. దీంతో కాంచన, అనసూయ షాక్ అవుతారు. దీంతో కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది