Karthika Deepam Today Episode : జ్యోత్స్న ప్లాన్ నాశనం..కావేరి అంత పని చేసింది ఏంటి ?
ప్రధానాంశాలు:
Karthika Deepam Today Episode : జ్యోత్స్న ప్లాన్ నాశనం..కావేరి అంత పని చేసింది ఏంటి ?
Karthika Deepam Today Episode : కార్తీక దీపం సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. దీప కూరగాయలు కట్ చేస్తూ ఉంటే కార్తీక్ వచ్చి ముచ్చటిస్తాడు. అప్పుడు రోజుకొక గులాబి ఇస్తానని చెప్పి కూల్ చేస్తాడు. అప్పుడే అక్కడికి కావేరి వచ్చి జ్యోత్స్న గురించి చెప్తుంది.. అసలు జ్యోత్స్న పెళ్లి నువ్వు ఆపలేదు.. నువ్వు ఆపేలా జ్యోత్స్న ప్లాన్ చేసింది అంటుంది.

Karthika Deepam Today Episode : జ్యోత్స్న ప్లాన్ నాశనం..కావేరి అంత పని చేసింది ఏంటి ?
Karthika Deepam Today Episode అలా చేసింది ఎందుకు ?
అయితే జ్యోత్స్న కావాలనే ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్టు నాటకం ఆడింది అని దీపకు కావేరి చెప్తుంది.. ఇది విని ఆశ్చర్యపోయి ఇదంతా ఏంటి అని దీప అంటే.. ఏమో మరీ.. గౌతమ్ అందరిని మోసం చేస్తున్న అనుకుంటున్నాడు.. కానీ అతనికి మించి జ్యోత్స్న అందరిని మోసం చేస్తుంది అని చెప్తే సరే ఈ విషయం ఎవరికి చెప్పకండి అని దీప కావేరితో మాట తీసుకుంటుంది.
ఇదిలా ఉంటే జ్యోత్స్న పెళ్లి ఫారెన్ లో చెయ్యాలి అనుకుంటున్నట్టు శివన్నారాయణ చెప్తే.. వద్దు తాతయ్య.. నా పెళ్లి ఇక్కడే ఈ ఇంట్లోనే జరగాలి అని శివన్నారాయణను అడుగుతుంది.. సరే అని చెప్తుంది. మొత్తానికి ఈ విషయాలు కొంత ఆసక్తికరంగా మారగా, తర్వాత ఏం జరుగుతుంది అని ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు.