Viral Video : 500 చిల్లర కోసం వెళ్లి .. సిమెంట్ ట్యాంకర్ కింద పడి చనిపోయిన యువకుడు .. వీడియో !!
Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరుగుతుందో అది క్షణాల్లో తెలిసిపోతుంది. తాజాగా సోషల్ మీడియాలో సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిన వీడియో వైరల్ అవుతుంది. అందులో ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ప్రతి ఇంటికి ఒకటి లేదా రెండు వాహనాలు ఉంటున్నాయి. ఒకప్పుడు సైకిల్ ని ఉపయోగించేవారు దాంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేవి కాదు. కానీ ప్రస్తుతం మారిన జీవనశైలికి జనాలు సుఖ పడిపోవడం అలవాటు చేసుకున్నారు.
అది ఎంత దూరమైనా సరే వాహనాలను వేసుకొని వెళుతున్నారు. ఇక రోడ్డుమీద వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాలి. మనం కరెక్ట్ రూటులో వెళుతున్న ఎదురుగా వచ్చేవాళ్లతో ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్డు మీద వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాలి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు సిమెంట్ ట్యాంకర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ మొయినాబాద్ సమీపంలో చోటుచేసుకుంది.
మొయినాబాద్ సమీపంలో విగ్నేష్ అనే యువకుడు రోడ్డు పక్కన భోజనం చేసి రూ.500 నోటు ఇచ్చాడు. చిల్లర లేదని హోటల్ నిర్వాహకులు చెప్పగా చిల్లర తెచ్చేందుకు వెళ్లాడు. డబ్బులు తీసుకొని వెళుతుండగా వెనకే సిమెంటు లారీ వచ్చి ఒక్కసారిగా ఢీ కొట్టింది. దీంతో విగ్నేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో కనిపించింది. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా విగ్నేష్ మరణంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
500 చిల్లర కోసం వెళ్లి సిమెంట్ ట్యాంకర్ కింద పడి చనిపోయాడు
హైదరాబాద్ – మొయినాబాద్ సమీపంలో విగ్నేష్ చారి అనే యువకుడు రోడ్డుపక్కన భోజనం చేసి, రూ.500నోటు ఇవ్వడంతో హోటల్ నిర్వాహకుడు చిల్లర లేదని చెప్పాడు.
చిల్లర తీసుకొని వెనుదిరగగా లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. pic.twitter.com/4mAcVk94W8
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2023