Viral Video : జూమ్‌ కాల్‌లో.. 900 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించిన ఆ సీఈఓ.. షాక్ లో ఉద్యోగులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : జూమ్‌ కాల్‌లో.. 900 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించిన ఆ సీఈఓ.. షాక్ లో ఉద్యోగులు..!

 Authored By kranthi | The Telugu News | Updated on :6 December 2021,8:04 pm

Viral Video : వర్క్‌ ఫ్రమ్‌ హోం లో ఉన్న ఉద్యోగులకు ఓ కంపెనీ సీఈఓ భారీ షాక్ ఇచ్చాడు. సాధారణంగా రోజులాగే జూమ్ లో మీటింగ్ ను ఆరెంజ్ చేశాడా అధికారి. అయితే అది మీటింగ్‌ కోసం కాదని తమను తీసేసెందుకు ఏర్పాటు చేసిన మీటింగ్ అని తెలిసే సరికి ఆ ఉద్యోగులంతా ఖంగు తిన్నారు. ఇంతకు ఆ సీ ఈ వో తొలగించింది ఎంత మందినో తెలుసా.. పది, ఇరవై కాదండీ. ఏకంగా 900 మంది ఉద్యోగులను ఒకేసారి తన కంపెనీ నుంచి తీసేశాడు. అందుకు కారణం ఏంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఇంకెందుకు ఆలస్యం పదండి.

అమెరికాకు చెందిన ఓ ప్రముఖ గృహ రుణాలు, తనఖా సంస్థ బెటర్‌.కామ్‌ సీఈవో విశాల్‌ గార్గే నే మనం ఇంతసేపు మాట్లాడుకున్న వ్యక్తి. ఉద్యోగులు తమ రోజువారీ పనిలో చూపించే.. సమర్థత, పనితీరు నచ్చక పోవడం తదితర కారణాలతోనే వారిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు విశాల్‌ వెల్లడించారు. రోజుకు 8 గంటలు పని చేయాల్సిన ఉద్యోగులు… కనీసం 2 గంటలు కూడా పనిచేయడం లేదంటూ వారిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మీటింగ్ అనంతరం ఎవరెవరిని తీసేశామో వారికి మెయిల్ వస్తుందని అనడంతో ఒక్కసారి ఉద్యోగుల గుండెల్లో బాంబులు పేలినంత పనైంది.

american software company 900 employees removes in a zoom meeting

american software company 900 employees removes in a zoom meeting

Viral Video : పని సరిగా చేయడం లేదని..!

గత బుధవారం జరిగిన ఈ విషయానికి సంబంధించిన వీడియోను ఓ ఉద్యోగి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన అనంతరం.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తన కెరీర్‌లో రెండోసారి అని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగక… గతంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు తాను ఎంతగానో బాధపడుతూ ఏడ్చినట్లు చెప్పడం కొస మెరుపు. ఇదిలా ఉండగా ఆ తొలగింపబడిన ఉద్యోగులతో పాటు అనేక మంది విశాల్ పై విరుచుకు పడుతున్నారు. ముందే తెలియజేయకుండా ఓ జూమ్ మీటింగ్ లో వందల మందిని ఎలా తొలగిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది