Viral Video : బంజారా అమ్మాయిలా మజాకా.. నాటు స్టెప్పులతో ఇరగదీసేశారుగా!
Viral Video : ఏదైనా మంచి అకేషన్ వచ్చిందంటే డీజే సౌండ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేయడం చాలా మందికి ఇష్టం. అయితే, ఒకప్పుడు ఆడవాళ్లు ఇంట్లోంచి బయటకు రావడానికే బయపడేవారు. స్త్రీలే కాదు.. అమ్మాయిలు కూడా మగవాళ్లు డ్యాన్స్ చేస్తే ఇంట్లోని కిటికి లేదా ఇంటిపై దాబా నుంచి చూసేవారు. కానీ బయటకు వచ్చి డ్యాన్స్ చేయాలంటే చాలా భయపడేవారు. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. కాలం ఆడవాళ్లకు ఉండే హద్దులను చెరిపేసింది. దీంతో వారు తమకు తోచిన విధంగా ఎంజాయ్ చేస్తున్నారు.
Viral Video : బంజారా స్పెషల్ డ్యాన్స్..
సాధారణంగా అమ్మాయిలు కొందరు బయటకు రావాలన్నా భయపడుతుంటారు. కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయిలు చాలా మారిపోయారు.అబ్బాయిల కంటే వారే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి బారాత్ అంటే ఒకప్పుడు ఎక్కువగా అబ్బాయిలే డ్యాన్స్ చేసేవారు.కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అబ్బాయిలు పక్కన కూర్చుని చూస్తుంటే అమ్మాయిలు, ఆంటీలు తెగ రెచ్చిపోతున్నారు. డీజే సాంగ్స్ పెట్టుకుని నాటు స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. అయితే, బంజారా వారికి ఒక ఆచారం ఉంటుంది. పెళ్లి కంటే ముందే వారు ఇంట్లో వారితో ఆడిపాడి రంగరంగ వైభవంగా వివాహం జరుపుకుంటారు.

Banjara Girls New Dance Does Hit Song Does Folk Song By Village Girls
పెళ్లి తర్వాత అప్పగింతల సమయంలో జరగాల్సిన డ్యాన్స్ ప్రోగ్రామ్ వీరికి తాళి కట్టే తంతు కంటే ముందే ఉంటుందట.. ఆ సమయంలో ఇంట్లోని ఆడవాళ్లంతా డ్యాన్సులు చేస్తారట.. ఇక మగవాళ్లు ఒక పక్కన ఉండి చూస్తారు. వీరు ఏ పండుగ అయినా.. పెళ్లి అయినా చాలా ఘనంగా నిర్వహించుకుంటారు.తాజాగా ఓ వివాహ వేడుకలో బంజారా అమ్మాయిలు రెచ్చిపోయారు. ఒకరిని మించి మరొకరు రెచ్చిపోయి మరి డ్యాన్సులు చేశారు. నాటు స్టెప్పులు వేస్తూ చుట్టుపక్కల వారిని మెప్పించారు. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో చాలా వ్యూస్ సాధిస్తోంది.
