Viral Video : బుల్లెట్ బండి పాటతో అదరగొట్టిన పెళ్లి కూతురు.. డ్యాన్స్ వీడియో

Authored By mallesh | The Telugu News | Published on: June 23, 2022, 2:00 pm

Viral Video: ఈ మ‌ధ్య‌కాలంలో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. నిత్యం వేల‌ల్లో నెట్టింట్లో ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. పెళ్లంటే చాలు ప‌క్కా డ్యాన్స్ ఉండాల్సిందే… ఏ పెళ్లిలో చూసినా పెళ్లికూతురు, పెళ్లికూతురు డ్యాన్స్ బాగా వైర‌ల్ అవుతోంది. డీజే సాంగ్స్ కి అద‌రిపోయే డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇక పెళ్లి కూతురు మండ‌పంలోనే డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తోంది.

సిగ్గుతో త‌ల దించుకునే ట్రెండ్ మార్చి ఫుల్ జోష్ లో డ్యాన్స్ తో ద‌మ్ములేపుతున్నారు. పెళ్లి కొడుకు సిగ్గుతో అంద‌రిముందు డ్యాన్స్ చేయ‌లేని సంద‌ర్బాలు ఉంటాయి కానీ.. పెళ్లి కూతురు ఎక్క‌డా కూడా త‌గ్గ‌ట్లేదు.ఎక్కువ‌గా వెడ్డింగ్ డ్యాన్స్ అంటే గుర్తుకువ‌చ్చే సాంగ్ నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌ప్పా డుగ్గు డుగ్గు డుగ్గు అని.. ఈ సాంగ్ ప్ర‌తిపెళ్లిలో ఉండాల్సిందే. పెళ్లి కూతురు పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేయ‌డానికి క్యూట్ లుక్స్ తో ఈ సాంగ్ పై డ్యాన్స్ చేసి ప్రేమ‌ను చూపిస్తోంది.

bride cute dancing video on viral

bride cute dancing video on viral

ఎక్క‌డో ఒక‌చోట మొద‌లైన ఈ ట్రెండ్ సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో బాగా ఫేమ‌స్ అయింది. చాలా మంది ఈ వీడియోలు చూసే త‌మ పెళ్లిలో డ్యాన్స్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం క‌పుల్స్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌ప్పా డుగ్గు డుగ్గు డుగ్గు అని.. సాంగ్ కి పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తుండ‌గా పెళ్లికొడుకు కాస్తా సిగ్గుప‌డుతున్నాడు. ఇక మ‌ధ్య‌లోకి బామ్మ ఎంట్రీ ఇచ్చి అద‌ర‌గొట్టింది.

https://www.youtube.com/watch?v=XpR3nSsr33s

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp