Viral Video : పెళ్లి కూతురు మండ‌పంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందంటే.. చుట్టూ అమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ..

Authored By mallesh | The Telugu News | Published on: July 27, 2022, 2:00 pm

Viral Video : పెళ్లంటే ఆ సంద‌డి ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే… ఇంటి నిండా బంధువులు ఫ్రెండ్స్ స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తారు. ఇక పెళ్లి కూతురిని అందరూ ఆట‌ప‌ట్టిస్తూ అల్ల‌రి చేస్తారు. పెళ్ల‌న‌గానే ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ చేస్తూ కొత్త‌జంట సంద‌డి చేస్తారు. అలాగే సంగీత్ లో డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటారు. ఇంటిల్లిపాది స్టెప్పులు వేస్తూ గోల‌గోల చేస్తుంటారు. ఇక పెళ్లి కూతురు సిగ్గుప‌డుతూ ఉంటే ఫ్రెండ్స్ ఆట‌ప‌ట్టిసారు.. కానీ ప్ర‌స్తుతం ట్రెండ్ ఫాలో అవుతున్నారు పెళ్లికూతుర్లు. ఎలాంటి భ‌యం లేకుండా చుట్టూ ఎంత‌మంది ఉన్నా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి వీడియోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

దీంతో మ్యారేజ్ అంటేనే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు త‌ప్ప‌నిస‌రిగా డ్యాన్స్ చేసేలా ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోల‌కు మంచి క్రేజ్ ఉంది. నెటిజ‌న్లు కూడా వీటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే చాలామంది అమ్మాయిల‌కు.. అబ్బాయిల‌కు పార్ట్ న‌ర్ తో డ్యాన్స్ చేయాల‌ని ఉంటుంది.. అయితే ఇదివ‌ర‌కు పెళ్లి త‌ర్వాత ఇద్ద‌రూ క్లోస్ అయ్యాక ఎక్కడో ఓ ఫంక్ష‌న్ లో డ్యాన్స్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు.. ఏకంగా మండపంలోనే ఇద్ద‌రూ డ్యాన్స్ చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. రిసెప్ష‌న్ లో.. బ‌రాత్ లో ఎక్క‌డా వ‌ద‌ల‌కుండా వ‌ధూవ‌రులు డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్ట‌కుంటున్నారు.

Bride entry dance video in youtube

Bride entry dance video in youtube

ఇక అమ్మాయిలైతే మ‌రింత ఎంజాయ్ చేస్తున్నారు.. పెళ్లి కూత‌రు మండ‌పంలోకి వ‌స్తూనే ఎంట్రీ డ్యాన్స్ చేసి అంద‌రి చూపు త‌న వైపు తిప్పుకుంటోంది. కాగా ప్ర‌స్తుతం పెళ్లి కూతురు చీర‌క‌ట్టులో ముస్తాబై అమ్మాయిల‌తో క‌లిసి ఎంట్రీ డ్యాన్స్ చేస్తోంది. అద‌రిపోయే ఎక్స్ ప్రెష‌న్స్ తో ఫుల్ జోష్ లో మండపంలోకి ఎంట్రీ ఇస్తోంది. చుట్టూ బంధువులు.. ఫ్రెండ్స్ అంద‌రూ త‌న వైపే చూస్తూ ఎంక‌రేజ్ చేస్తున్నారు.. కాగా ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేయ‌డంతో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు పెళ్లి కూతురు డ్యాన్స్ కి ఫిదా అవుతున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp