Viral Video : బ‌రాత్ లో పెళ్లి కూతురు మాస్ డ్యాన్స్.. చూస్తే అరుపులే..

Authored By mallesh | The Telugu News | Published on: July 14, 2022, 2:00 pm

Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. ఎక్క‌డ చూసినా పెళ్లిలో వ‌ధూవ‌రుల డ్యాన్స్ ట్రెండ్ న‌డుస్తోంది. ఇక అమ్మాయిల సంద‌డి మామూలుగా ఉండ‌దు. మండ‌పంలోనే డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు. డీజే పాట‌ల‌కు మాస్ డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. అబ్బాయిలు సిగ్గుప‌డుతున్నా అమ్మాయిలు మాత్రం త‌గ్గేదేలా అంటూ ఊర‌మాస్ డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఎంగేజ్ మెంట్, పెళ్లి, బ‌రాత్ ఇలా కార్య‌క్ర‌మం ఏదైనా డ్యాన్స్ మాత్రం కామ‌న్ అంటున్నారు.

ఈ డ్యాన్స్ ని వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేస్తుండ‌టంతో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. తెలంగాణ‌లో ప్ర‌త్యేకంగా బ‌రాత్ కార్య‌క్ర‌మం ఉంటుంది. డీజే సాంగ్స్ కి ఫ్రెండ్స్ ఇంటిల్లిపాది డ్యాన్స్ చేసి సంద‌డి చేస్తారు. ఇక పెళ్లికొడుకు పెళ్లికూతురుతో కూడా డ్యాన్స్ చేయిస్తుంటారు. ట్రెండింగ్ సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు. పెళ్లి కూతురును అత్తవారింటికి సాగ‌నంపే క్ర‌మంలో అంద‌రూ ఒక్క చోట చేరి డ్యాన్స్ చేస్తారు.

bride mass dance in barat video on Youtube

bride mass dance in barat video on Youtube

ఇక పెళ్లికూత‌రు అప్ప‌గింత‌లు అయిన త‌ర్వాత డ్యాన్స్ డీజే పాట‌ల‌కు డ్యాన్స్ చేస్తుంటారు. ప్ర‌స్తుతం బ‌రాత్ లో పెళ్లికూతురు మాస్ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌పా.. సాంగ్ కి పెళ్లికొడుకు ఎదురుగా డ్యాన్స్ చేస్తూ ఇంప్రెస్ చేస్తోంది. చూట్టూ ఫ్రెండ్స్ బంధువులు చేరి ఎంక‌రేజ్ చేస్తున్నారు. దీంతో నెటిజ‌న్లు సూప‌ర్ డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp