Viral Video : మండపంలో ఊడిన పెళ్లి కొడుకు విగ్.. పెళ్లి కూతురు ఏం చేసిందంటే..
Viral Video : కొంతమంది పెళ్లి చేసుకోవటానికి నానా తంటాలు పడుతుంటారు. ఎట్టకేలకు పెళ్లి ఫిక్స్ అయితే అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ ఎక్కడో ఒక్కచోట బొల్తా కొడుతుంటారు. వయసు ఎక్కువగా ఉందనో.. లేక జాబ్ లేదనో.. నల్లగా.. పొట్టిగా ఉన్నాడనో ఎక్కువగా మ్యాచెస్ చెడిపోతుంటాయి. ఇక చిన్న చిన్న లోపాలు అయితే మ్యానెజ్ చేస్తుంటారు. అబ్బాయిలకు వయసు అయిపోయే కొద్ది జుట్టు ఊడిపోవడం సాధారణం. లైఫ్ లో సెటిల్ అవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో పెళ్లిపై పెద్దగా ధ్యాస ఉండదు. తీరా వెల్ సెటిలయ్యాకా ఏజ్ బార్ అవడం.. లేక బట్టతల రావడం కామన్. అయితే ఈ లోపాలతో ఎన్నో సంబంధాలు చెడిపోతుంటాయి.
చివరకి లిటిల్ బిటిల్ మ్యానేజ్ చేసి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత విషయం తెలిసినా పెళ్లి కూతురు పెద్దగా పట్టించుకోదు.పెళ్లంటే ఆ తెగ ఎగ్జైట్మెంట్ అయిపోతుంటారు కొందరు. పెళ్లి చేసుకోవడానికి చిన్న చిన్న అబద్దాలు ఆడటం వెరీ కామన్. వెయ్యి అబద్దాలు ఆడినా సరే ఒక పెళ్లి చేయాలని పెద్దలు అంటుంటారు. అవి చిన్న చిన్న అబద్దాలు అయితే పర్లేదు. కానీ అమ్మయి ఆక్సెప్ట్ చేయకపోతే మాత్రం ఏవరూ ఏమిచేయలేరు. కాగా ఓ పెళ్లి కొడుకు బట్టతల ఉండటంతో అది దాచిపెట్టి విగ్ పెట్టుకుని పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ అనుకోకుండా బయటపడి ఏకంగా పెళ్లి ఆగిపోయేలా చేసింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో జరిగింది.పెళ్లికొడుకు బట్టతల ఉండటంతో విగ్ పెట్టుకుని మ్యానెజ్ చేశాడు.
అయితే అనుకోకుండ పెళ్లి కొడుకు స్పృహ తప్పిపడిపోవడంతో బంధువులు లేపే ప్రయత్నం చేశారు. తలపాగా తీసే ప్రయత్నం చేయడంతో విగ్ ఊడిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. పెళ్లికూతురు బంధువులు విగ్ విషయం దాచిపెట్టడంతో సీరియస్ అయ్యారు, పెళ్లి కూతురు కూడా ఈ పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేసింది. కాగా ఈ విషయంపై నెటిజన్లుపెళ్లి కూతురిని విమర్శిస్తున్నారు. కేవలం విగ్ ఉందని పెళ్లి రద్దు చేసుకోవడం ఏంటని.. మ్యారేజ్ తర్వాత బట్టతల రాదని గ్యారంటీ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.