Viral Video : వరుడు చేసిన కక్కుర్తి పనికి చెంప చెల్లుమనిపించిన వధువు .. వైరల్ వీడియో!!

Advertisement

Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. నిత్యం వేలాది వీడియోలు సోషల్ మీడియాను లో హల్చల్ చేస్తూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి. మొత్తానికి అయితే సోషల్ మీడియా పెద్ద ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫారం అయిపోయింది. ప్రతి ఒక్కరు కాస్త ఖాళీ సమయం దొరికిన సోషల్ మీడియాలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

Advertisement

తాజాగా సోషల్ మీడియాలో వధూవరుల పెళ్లి వీడియో వైరల్ అవుతుంది. పెళ్లిళ్లలో చేసే అల్లర్లు కలకాలం గుర్తు ఉండాలని కొంతమంది పిల్ల చేష్టలు చేస్తూ ఉంటారు. అయితే అది అందరికీ సరదాగా అనిపించిన కొందరికి మాత్రం చిరాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. తాజాగా ఓ పెళ్లి మండపంలో వరుడు చేసిన కక్కుర్తి పని వైరల్ అయింది. పెళ్లికూతురు రియాక్షన్ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. వధువు అందరి ముందే వరుడు కి తగిన గుణపాఠం చెప్పింది. ఇంతకీ పెళ్లి కొడుకు ఏం చేశాడంటే పెళ్లిరోజు కూడా తన చెడు అలవాటు మానుకోకుండా మండపానికి గుట్కా తింటూ వచ్చాడు.

Advertisement
Bride slaps bride groom viral video
Bride slaps bride groom viral video

దీంతో పెళ్లికూతురు కోపం వచ్చి అందరి ముందే వరుడుని చెంప పగలగొట్టింది. పెళ్లి మండపంలో పూజారి వరుడిని ఏదో తీర్థం తాగాలని కోరుతాడు. పెళ్ళికొడుకు నోట్లో గుట్కా ఉండడంతో తాగను అని చెబుతాడు. దీంతో పూజారి సర్దుకుపోతాడు. కానీ పెళ్లికూతురు మాత్రం ఈ విషయాన్ని వదలదు. పూజ ఇలానేనా చేసేది అని పూజారిని వీపు పై చరుస్తుంది. ఇక పెళ్లిలో గుట్కా తింటావా, తీర్థం తాగవా అని వరుడి చంప చెల్లుమనిపించింది. దీంతో వరుడు గుట్కాను బయటికి వెళ్లి ఉమ్మేస్తాడు. వధువు పెళ్లి కాకముందే ఈ స్థాయిలో అందరిని కొట్టి భయపెడుతుందంటే పెళ్లి అయితే పరిస్థితి ఏంటి అని అందరూ షాక్ అయిపోతున్నారు.

Advertisement
Advertisement