Viral Video : డ్యాన్స్ ఇర‌గ‌దీసిందిగా.. పెళ్లి కూతురు ఎన‌ర్జీ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Authored By mallesh | The Telugu News | Published on: July 9, 2022, 2:00 pm

Viral Video : పెళ్లంటే ఆ సంద‌డి మామూలుగా ఉండ‌దు. ట్రెడీష‌న‌ల్ డ్రెస్సింగ్.. ఇల్లు అలంక‌ర‌ణ.. పందిళ్లు ఇలా ఎన్నో ఏర్పాట్లు చేస్తుంటారు. వీట‌న్నింటితో పాటు ప్ర‌స్తుతం డ్యాన్స్ చేయ‌డానికి కూడా ముందుగా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రూప్ గా పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అలాగే పార్ట్ న‌ర్ తో డ్యాన్స్ చేయ‌డానికీ ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు ఇష్ట‌ప‌డ‌తున్నారు. మండపానికి వ‌స్తూ పెళ్లి కూతురు ఎంట్రీ డ్యాన్స్ తో అద‌ర‌గొడుతున్నారు.

ఇలా నెట్టింట్లో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు నిత్యం వేల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.. దీంతో మ‌రింత క్రేజ్ పెరిగిపోయింది. ప్ర‌స్తుతం అంద‌రూ ఇలాగే ఫాలో అవుతుండ‌టంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక కేర‌ళ వెడ్డింగ్ వీడియోలు ప్ర‌త్యేంక‌గా ఉంటున్నాయి. పెళ్లికూతురు ప్ర‌త్యేకంగా ముస్తాబై కొంత‌మందితో క‌లిసి గ్రూప్ గా డ్యాన్స్ చేస్తూ వీడియోల‌కు, ఫొటోల‌కు పోజులిస్తున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి మాస్ స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

Bride wedding dance video on YouTube

Bride wedding dance video on YouTube

ప్ర‌స్తుతం కేర‌ళ వెడ్డింగ్ డ్యాన్స్ వీడియో వైర‌ల్ అవుతోంది. పెళ్లి కూతురు ఫుల్ ఎన‌ర్జిటిక్ గా డ్యాన్స్ చేస్తూ మ‌తిపోగొడ‌తోంది. పెళ్లి కూతురు ఎక్స్ ప్రెష‌న్స్ కి ఎవ‌రైనా స‌రే ఫిదా అవ్వాల్సిందే. పెళ్లి కూతురు చీర‌క‌ట్టులో అందంగా ముస్తాబై మాస్ స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటోంది. దీంతో నెటిజ‌న్లు పెళ్లికూతురి ఎన‌ర్జీకి ఫిదా అవుతున్నారు. కామెంట్స్ చేస్తూ లైక్స్ కొడుతున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp